హైదరాబాద్: మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MLRIT) హైదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ట్రాన్స్‌ఫార్మర్ డిజైన్లపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ ఆండ్ పాలిటెక్నిక్ కళాశాలల నుండి సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి ట్రాన్స్‌ఫార్మర్ డిజైన్లపై శిక్షణ ఇచ్చారు.

ఎంఎల్ఆర్ఐటి సెక్రటరీ మర్రి రాజశేఖర్ రెడ్డి డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని అభినందిస్తూ, వర్క్ షాప్ పాల్గొనేవారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తుందని, విద్యార్థులు వారి పరిజ్ఞానాన్ని మరింతా మెరుగు పరుచుకుంటారని చెప్పారు.

ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎంఎల్ఆర్ఐటి విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ సుధాకర్, ఇఇఇ రాధికాదేవి, మహేంద్ర, పి జితేందర్, ఎస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

By admin