గౌడ్ అకాడమీకి అడుగేసిన వాస్తవాలు.!!
హైదరాబాద్ స్టేట్ గా ఉన్న నిజాం సంస్థానం 1942 అప్పటికి రెడ్డి హాస్టల్ వైశ్య హాస్టల్ ఉన్న రోజులు.
మహబూబ్‌నగర్ కు చెందిన గట్టన్న గౌడ్ చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు రావడం జరిగింది. తనతో పాటు జనార్దన్ రాయ్ గౌడ్, మీనాక్షయ్య గౌడ్ కలిసి సత్తూర్ రామన్న గౌడ్ ను సంప్రదించగా రెడ్డి హాస్టల్ ఫౌండర్ రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డికి చెప్పి రెడ్డి హాస్టల్ లో వసతి కల్పించాలని కోరగా తను హాస్టల్ మేనేజ్మెంట్ వారికి చెప్పారు. మేనేజ్మెంట్ ఇవ్వకపోవడంపైగా అవమానపరచడంతో వైశ్య హాస్టల్ సంప్రదించగా, అక్కడ కూడా వసతి దొరకకపోవడంతో గట్టన్న గౌడ్ సత్తూరు రామన్న గౌడ్ ను బాధగోని గురవయ్య గౌడ్ ను సంప్రదించగా వారు వసతి కోసం ఏర్పాట్లు చేసుకోమనడంతో రెడ్డి హాస్టల్ కు ఎదురుగా అద్దె భవనం తీసుకొని ఉండడం జరిగింది. దీనికి కావలసిన అద్దె, వాళ్లు తినడానికి కావలసిన ఏర్పాట్లు సత్తూర్ రామన్న గౌడ్ చూసుకునేవారు.
అలా 7 ఆగస్టు 1942లో ప్రారంభమైన గౌడ హాస్టల్ ప్రస్థానం గట్టన్న గౌడ్ మొండి పట్టుదలతో సత్తూర్ రామన్న గౌడ్ మనకు గౌడ హాస్టల్ ఉండాలని బంకట్ లాల్ బద్రుకను సంప్రదించగా హిమాయత్ నగర్ లోని గౌడ హాస్టల్ భూమి చూపించారు.
ఈ భూమి 5 500 గజాలు జాగా ఖరీదు ఒక గజం రెండు రూపాయలు మొత్తం 11000 రూపాయలకు తీసుకొని మొదటి అడ్వాన్స్ 500 రూపాయలు సత్తూర్ రామన్న గౌడ్ ఇవ్వడం జరిగింది.
మిగిలిన డబ్బుల కోసం చందా రూపకంగా బంకట్లాల్ బద్రుక 2000 రూపాయలు ఇచ్చారు అలాగే నిజాంబాద్ చెందిన రాజనర్సా గౌడ్ తోడ్పాటుతో బాధగోని గురువయ్య గౌడ్ సహకారంతో అడుగులు పడి మరి మిగిలిన ప్రధాన వరుసలో చాలామందిని సంప్రదించి చేసిన చందాలు నేడు గౌడ హాస్టల్ లో ఏర్పాటు చేసిన విగ్రహాలుగా వారు ఉన్నారు.
1. రాజనర్సలింగా గౌడ్
2. సత్తూర్ రామన్న గౌడ్
3. గొల్లపల్లి రాజనర్సా గౌడ్
4. తీగుళ్ల అత్తయ్య గౌడ్
5. తూల శంకరయ్య గౌడ్
6. గౌని బాబయ్య గౌడ్
7. పండాల యాదయ్య గౌడ్
8. బొడ్డు లక్ష్మయ్య గౌడ్
వీరితో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న కల్లు కాంపౌండ్ ల నుండి చందారూపేణ వసూలు చేసి కొన్న భూమి. అందులో హెచ్ ఆర్ బసవరాజ్ బెంగళూరు గారి సహాయం కూడా ఉంది. మొత్తం 10000 కాగా మిగిలినవి లేక భూయజమానిని బతిమాలగా వెయ్యి రూపాయలు మాఫీ చేసి 1950 ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.
ఈ భూమి చుట్టూ ప్రాంతాలవారు కబ్జాకు గురి చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో మంత్రిగా పనిచేసిన టి బాలా గౌడ్ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కబ్జా నుండి విముక్తి చేయడం జరిగింది. బాలా గౌడ్ కామారెడ్డి జిల్లా లింగంపేట కు చెందిన వారు.
కీలకంగా నిలబడిన వారిలో ముందు వరుసలో ఉన్న సత్తూర్ రామన్న గౌడ్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉండి అనేక మార్పులకు శ్రీకారం ఆనాడే చుట్టారు. అలాగే బాధగొని గురవయ్య గౌడ్ మహబూబ్నగర్ రాజ నర్సాగౌడ్ నిజామాబాద్ గార్ల శ్రమ మరువలేనిది
ఆనాడు ఒక పైసా నేడు 1000 రూపాయలతో సమానం. భూమి కొన్న కానీ కట్టడం ప్రధాన ధ్యేయంగా గురువయ్య గౌడ్ కీలక పాత్ర పోషించారు. నాడు 9 రూముల బాధ్యత వేసుకొని మహబూబ్ నగర్ కు చెందిన కొంతమందితో ఆర్థిక సహాయాన్ని తీసుకొని కట్టడం జరిగింది.
ఈ 9 రూములతో పాటు మరికొంతమంది భాగస్వామ్యంతో 23 రూములు ఆనాడే కట్టడం జరిగింది. వారి పేర్లు ఏ రూముకు ఎవరెవరి సహాయం ఉన్నది అనేది
1 నుండి 3 రూములకు
బాధగొని గురువయ్య గౌడ్. (వనపర్తి చింతకుంట) మూడవ రూం గొల్లపల్లి రాజనర్సయ్య4 వ రూమ్
వి సీతారాం గౌడ్ (ఆత్మకూరు)
వి నారాయణ గౌడ్ (నాగర్ కర్నూల)
పల్స రామస్వామి గౌడ్, (తాటిపాముల)
ఎన్ రామా గౌడ్ (కొల్లాపూర్)
చుక్కా రమన్ గౌడ్
తీగుళ్ల సత్తయ్య గౌడ్5 వ రూమ్
పాటపర్ల బాలమ్మ (పెంటవెల్లి)
మాచర్ల బాలయ్య గౌడ్6 వ రూమ్
చుక్కా రాములు గౌడ్ (వికిరేవులపల్లి)
బాలా లక్ గౌడ్ (తూముకుంట)
మాచర్ల బాలయ్య గౌడ్ (పెంటవెల్లి)
బి నందన్న గౌడ్7 నుండి 9 రూములు
సోమా గౌడ్ హుసేనప్ప (అడ్డాకుల)10 వ రూమ్
ఏ అనంతారం (జహీరాబాద్)11వ రూమ్
లక్ష్మమ్మ రామా గౌడ్ (ఆత్మకూర్)12వ రూమ్
అంజయ్య వీర్ సంగయ్య (హైదరాబాద్)13 నుండి 15 వరకు
హెచ్ ఆర్ బసవరాజ్ గౌడ్ (బెంగళూరు)16, 17 రూం
మోడ్ల రంగప్ప18 వ రూమ్
గడ్డమీది కళావతమ్మ (హైదరాబాద్)19 వ రూమ్
పగడాల వెంకటయ్య (గౌలిగూడ హైదరాబాద్)20 వ రూమ్
గడ్డమీది అనంతమ్మ (హైదరాబాద్)21 వ రూమ్
తూళ్ళ సాయన్న గౌడ్ (హైదరాబాద్)22 వ రూమ్
ఎర్ర శంకరయ్య గౌడ్
ఎర్ర రాజలింగం గౌడ్ (కాప్రా ఈసీఐఎల్)23 వ రూమ్
కె రాజా గౌడ్ఫౌండర్ ప్రెసిడెంట్ గా సత్తూర్ రామన్న గౌడ్ ఉండగా
మొదటి ప్రెసిడెంటుగా బాధగోని గురువయ్య గౌడ్
వైస్ ప్రెసిడెంట్ గా పండాల యాద గౌడ్
సెక్రెటరీగా గట్టన్న గౌడ్
నాటి గౌడ హాస్టల్ నిర్మాణానికి స్థల సేకరణకి కీలకమైన ముఖ్యులు మొదటి స్థానంలో సత్తూర్ రామన్న గౌడ్, బాధగొని గురవయ్య గౌడ్, గట్టన్న గౌడ్, రాజనర్సగౌడ్ పాత్ర ఎనలేనిది ఎవరు కొలువలేనిది.
జంగంరావ్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో పై అంతస్తుల నిర్మాణం జరిగింది వారికి కూడా ప్రత్యేక అభినందనలు.
అలాగే గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ గౌడ్, ఆధ్వర్యంలో మహిళా విద్యార్థినీల కోసం ప్రత్యేక నిర్మాణం ఉండాలనే తలంపుతో 2005లో గాయత్రి బ్లాక్ గా మహిళ గౌడ హాస్టల్ నిర్మాణం చేశారు.
అలాగే నేడు ప్రారంభం చేసుకోబోతున్న ఉప్పల్ భగాయత్ లోని గౌడ్ అకాడమీకి ఎన్నో విమర్శలు, మరెన్నో సవాళ్లకు ఎదురు నిలబడి మొండి పట్టుదలతో అనేక వ్యక్తుల హార్దిక సహాయంతో నిర్మాణానికి నిధిని జోలె పట్టి తిరిగి సేకరించిన ఈ బిల్డింగ్ మన ముందుంచిన పల్లె లక్ష్మణ్ గౌడ్ కు నిజంగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ తనకు సహకరించిన కమిటీ మెంబర్లకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.
పటన్ చెరువు దగ్గరలోని నందిగామ నందు అర ఎకరం దానం ఇచ్చి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న దొంతు లక్ష్మీనారాయణ గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరుపేరునా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
– మీ ‘ఈతముల్లు’ ప్రసాద్
- * *
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php