జగిత్యాల (మీడియాబాస్ నెట్‌వర్క్): వలస కార్మికులకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘గల్ఫ్ భరోసా యాత్ర’ కార్యక్రమం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో జరిగింది. గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. వలస కార్మికులకు అవగాహన, చైతన్య పరిచెందుకే ఈ గల్ఫ్ భరోసా యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో చేస్తామని అందులో భాగంగా మేడిపల్లి మండలంలో చేపట్టామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల సమస్యలను, బాధితుల బాధలను అస్సలు పట్టించుకోవడం లేదని, గల్ఫ్ కార్మికుల చిరకాల స్వప్నం గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి కార్మికులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వాలు కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న అన్యాయల్ని తెలియజేస్తామని రానున్న ఎలక్షన్స్‌లో తగిన బుద్ధి చెప్తామని అన్నారు.
తక్షణం 500 కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. గల్ఫ్‌లో ఏ కారణంతో అయిన మృతి చెందిన కుటుంబానికి 5 లక్షల మృత ధన సహాయం చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులకు పునారవాస పునరేకీకరణ ప్యాకేజీ కోసం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవిధంగా ఉండాలని Tpcc Nri సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల గల్ఫ్ జేఏసీ నాయకులు పల్లి అర్జున్, కుంట శ్రీనివాస్, కాచర్ల అంజయ్య , మైధం మహిపాల్ వెంకట్ రెడ్డి, సుధాకర్, భూమేష్, ఎండీ రాజబాస్ తదితర కార్మికులు పాల్గొన్నారు.