హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఆర్య‌వైశ్యుల మ‌ధ్య సంతోష‌క‌ర‌మైన బంధాల‌ను-అనుబంధాల‌ను పెంపొందించుట‌కు ప్ర‌పంచ ఆర్య‌వైశ్య మ‌హ‌స‌భ (WAM) భారీ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌బోతోంది. ప్ర‌పంచ ఆర్య‌వైశ్య మ‌హ‌స‌భ (వామ్) ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో వామ్ గ్లోబ‌ల్ క‌న్వేన్ష‌న్ నిర్వ‌హించ‌బోతున్నారు. ప్ర‌పంచ ఆర్య‌వైశ్య మ‌హ‌స‌భ (వామ్) రెండు ద‌శాబ్దాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో చ‌రిత్ర‌లో నిలిచిపోయే విధంగా గ్లోబ‌ల్ క‌న్వేన్ష‌న్‌ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

రాజ్య‌స‌భ స‌భ్యులు, వామ్ గ్లోబ‌ల్ గౌర‌వ అధ్య‌క్షులు టీజీ వెంక‌టేష్ నేతృత్వంలో, వామ్ గ్లోబ‌ల్ ఆధ్య‌క్షులు టంగుటూరి రామ‌కృష్ణ అధ్య‌క్ష‌త‌న‌, గ్లోబ‌ల్ క‌న్వేన్ష‌న్ ప్రొగ్రామ్ క‌మిటీ చైర్మెన్ ఒఎస్ఎస్ ప్ర‌సాద్, వామ్ గ్లోబల్ ఎన్నారై విభాగ్ చైర్మెన్ & వామ్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ చైర్మన్ ఎంఎన్ఆర్ గుప్త‌ల కృషితో ఈ కార్య‌క్ర‌మం గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 దేశాల‌తో పాటు 20 రాష్ట్రాల్లో వామ్ వ్యాపించి, శ‌క్తివంత‌మైన సేవా సంస్థ‌గా గుర్తింపు క‌లిగి ఉంద‌ని నిర్వ‌హకులు తెలిపారు. ఈ క‌న్వేన్స‌న్‌కు ఇత‌ర దేశాల నుంచి సుమారు 4 వేల నుంచి 6 వేల మంది ప్ర‌తినిధుల‌తో, అర‌బ్ దేశాల నుంచి కూడా వామ్ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యే ఈ స‌మ్మేళ‌నం భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. కార్పోరేట్ స్థాయిలో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పారిశ్రామికవెత్త‌లు, రాజ‌కీయ‌, వ్యాపార‌, మేధావులు, మ‌హిళ‌లు, యువ‌త పెద్ద సంఖ్య‌లో హాజ‌రు కానున్నార‌ని నిర్వ‌హకులు తెలిపారు.

ప్ర‌పంచంలోని అన్ని దేశాల నుంచి డెలిగేట్స్ భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వ్వ‌డం WAM చ‌రిత్ర‌లోనే అపురూప ఘ‌ట్ట‌మ‌ని వామ్ గ్లోబల్ ఎన్నారై విభాగ్ చైర్మెన్ & వామ్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ చైర్మన్ ఎంఎన్ఆర్ గుప్త తెలిపారు. నభూతో నభవిష్యతీ అనే రీతిలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌బోతున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

 

 

EDITORIAL ‘అగ్నిపథ్’ పథకం అంటే ఏంటి? ఎందుకీ ఆందోళ‌న‌లు?

By admin