HYDERABAD (MediaBoss Network):
దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవాడు సైనికుడు. సరిహద్దుల వద్ద ఎటువంటి కఠిన పరిస్థితులు ఉన్నా.. తట్టుకుంటూ.. దేశ భద్రత కోసం పాటుపడతారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ మన రక్షణ కోసం పాటుపడుతారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు. అలాంటి యోధులను గుర్తించడానికి, వారికి చేతనయినంత సాయమందించడానికి ‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’ అనే సంస్థ ‘ఐ స్టాండ్ ఫర్ నేషన్’ అనే నినాదాన్ని దేశ ప్రజలతో చేయించబోతున్నాన్నారు. 2019లో జరిగిన పుల్వామా దాడిలో అమరవీరుల నివాళిగా ‘ఐ స్టాండ్ ఫర్ నేషన్’ రూపొందించారు. ‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’ అనే సంస్థను NGO జర్నలిస్టు ఇంటూరు హరికృష్ణ స్థాపించారు. ‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కిరణ్ రత్నం (USA), డాక్టర్ శ్రీనివాస్ ఉత్తర్‌వార్ (UK), ఈమని హరికృష్ణ రెడ్డితో సహా ఎంతోమంది ప్రముఖులతో కార్యనిర్వాహక సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
దేశం కోసం నిస్వార్థంగా తమ జీవితాలను అంకితం చేస్తున్న మన సైనిక యోధుల కోసం ISFW ఇప్పుడు #isalute2army అనే యాష్‌ట్యాగ్‌తో పాన్ ఇండియా ప్రచారంతో ముందుకు వచ్చింది. జనవరి 15, 2023 జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు వీరజవాన్లకు సెల్యూట్ చేసే రోజుగా ప్రతి పౌరుడిని ఒకేసారి #isalute2army అని చెబుతూ 60 సెకన్‌ల పాటు చప్పట్లు కొట్టాలని ISFW కోరింది. ఇది మన ప్రాణదాతలకు మనిస్తున్న చిరు సత్కారమని ISFW భావిస్తోంది.
భారతదేశ ఆర్మీ చరిత్రలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది జనవరి 15న భారత ఆర్మీ డే నిర్వహించుకుంటున్నాం.
https://www.youtube.com/watch?v=fjo6hnW-5Fo
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews