హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న దళిత బంధు పథక లో దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే ఎస్సీ ఉపకులాలకు ప్రతి నియోజకవర్గం లో 40 శాతం యూనిట్లు కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈమేరకు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ని సీనియర్ దళిత నాయకులు జెబి రాజుతో కలిసి విజ్ఞప్తి చేశారు.

ఎస్సి జనాభా లో 34శాతం ఉన్నప్పటికీ విద్యా, ఉద్యోగ, ఉపాది, రాజకీయ అవకాశలలో ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దళితబందు పథకం ఎమ్మెల్యేల పరిధి నుండి తొలగించి అధికారులచే సమగ్ర విచారణ జరిపి కాలయాపన చేయకుండా అర్హులైన వారికీ వెంటనే కేటాయించాలని, అన్ని పథకాలు అవకాశాలలో ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించగా ఉపకులాల సమస్యలపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, కురువ విజయ్ కుమార్ మదాసి కురువ, తులసిదాస్ గైక్వాడ్ మాంగ్ తదితరులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin