(USA ప్ర‌తినిధి – స్వాతి దేవినేని):

ఖండాంత‌రాల్లో మ‌ళ్లీ ఆ స్నేహ‌బంధం ఒకటైంది. ఏడు స‌ముద్రాల ఆవ‌ల క‌లుసుకున్నారు పూర్వ విద్యార్థులు. అమెరికాలోని న్యూజెర్సీలో JNTU అలుమ్ని అసోషియేషన్ అఫ్ USA ఆధ్వర్యంలో జ‌రిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా దశాబ్ధాల కాలం క్రితం చదువుకున్న సమయంలో నాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకున్నారు. 1972 నుంచి 2022 వరకు JNTU లో చదువున్న అప్ప‌టి ఈ విద్యార్థులు త‌మ ఫామిలీ మెంబ‌ర్స్‌తో సహా వచ్చి తమ మధుర స్మృతులను పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు ఇప్పుడు వివిధ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన‌సాగుతున్నారు.

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా JNTU ప్రొఫెసర్ కొత్త నరసింహారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ RP పట్నాయక్ పాల్గొన్నారు. JNTUH పూర్వ విద్యార్థుల సంఘాన్ని తెలంగాణ గవర్నర్ త‌మిళ‌సై ప్రారంభించారు. JNTUH సంస్థ ఫౌండర్ – చైర్మెన్ హరి ఎప్పనపల్లి, ఫౌండర్-BOD స్వామి శ్రీపెరంబుదూర్, ఫౌండర్-సెక్ర‌ట‌రీ సుధాకర్ ఉప్పల, ఫౌండర్-ఇంట‌ర్నేష‌న‌ల్ VP ప్రవీణ్ నిడుమోలు, ప్రెసిడెంట్ కుమార్ కృష్ణ రాణి, ట్రేజ‌ర‌ర్ విశ్వనాథ్ నరహరి.. త‌దిత‌రులు పాల్గొన్నారు.

USAలో 2020 నుంచి కొన‌సాగుతున్న ఈ సంఘం.. USAలోని పూర్వ విద్యార్థులందరినీ ఉన్నతీకరించడం, కొత్త సాంకేతికతపై మార్గదర్శకత్వం అందించడంలో విశ్వవిద్యాలయానికి సహాయం చేయడం ఈ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కోవిడ్ సమయంలో భారతదేశంలోని కొన్ని లాభాపేక్షలేని సంస్థలకు ఈ సంఘం 4 అంబులెన్స్‌లను అందించింది.

By admin