ప‌ర్సెంటేజీల‌తో సహా నిజ‌మైన ఫ‌లితాలు
టీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 38 శాతం
ఆధారాలు చూపించిన గేమ్‌ఛేంజ‌ర్-మీడియాబాస్
స‌ర్వే రిపోర్టుపై ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్ (బ్రేకింగ్‌న్యూస్ నెట్‌వ‌ర్క్):

మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయంఢంకా మోగించింది 10 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్‌ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ప్ర‌ముఖ పొలిటిక్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘గేమ్‌ఛేంజ‌ర్’ (#GameChanzer) ‘మీడియాబాస్‌’తో క‌లిసి చేసిన మునుగోడు స‌ర్వే ఫ‌లితాలు 100 శాతం నిజ‌మ‌య్యాయి.

తాజా ఫ‌లితాల్లో టీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 38 శాతం, కాంగ్రెస్ 10 శాతం ఓట్లు సాధించాయి. అక్టోబ‌ర్ 20వ తేదీన ‘గేమ్‌ఛేంజ‌ర్’ విడుద‌ల చేసిన మునుగోడు స‌ర్వే ఫ‌లితాల్లో స‌రిగ్గా ఇవే ఫ‌లితాలు వ‌చ్చాయి. టీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 38 శాతం, కాంగ్రెస్ 15 శాతం, ఇత‌రులు 4 శాతం ఓట్లు సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో ముందే తేల్చి చెప్పింది. అక్టోబ‌ర్ 20న ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను ప‌లు న్యూస్ మీడియా సంస్థ‌లు ప‌బ్లిష్ చేశాయి.

వాటి లింకులు:
https://youtu.be/ivLGMIpJIjk
https://youtu.be/USqclIPHhpA
https://breakingnewstv.co.in/munugode-survey-acr-10/

త‌మ స‌ర్వేలు ఎంతో పాద‌ద‌ర్శ‌కంగా ఉంటాయ‌ని, అందుకే ఖ‌చ్చిత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ‘గేమ్‌ఛేంజ‌ర్’ – ‘మీడియాబాస్’ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. గ‌తంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లోనూ త‌మ స‌ర్వే 100 శాతం నిజ‌మైంద‌ని ఈ సంద‌ర్భంగా ఈ సంస్థ ప్ర‌తినిధి సీహెచ్ ప్ర‌భాక‌ర్ తెలిపారు. మునుగోడు స‌ర్వే ఫ‌లితాలు 100 శాతం నిజం కావ‌డంతో త‌మ స‌ర్వే రిపోర్టుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయని ఆయ‌న తెలిపారు.

By admin