తెలంగాణను కాపాడుకునేందుకు కొత్త టీఆర్ఎస్ పార్టీ
రాజకీయ సంచలనానికి సిద్ధమైన పార్టీ
జెండా, ఎజెండా ప్రకటన
అధికార పార్టీ అస్తవ్యస్తంగా మారింది
తెలంగాణ ఉద్యమ పార్టీగా మేమే ఉంటాం
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుంటాం
కొత్త పార్టీ అధినేత నరాల సత్యనారాయణ
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణను కాపాడుకునేందుకు ఉద్యమ పార్టీగా తెలంగాణ రక్షణ సమితి (TRS) పార్టీ ఏర్పాటైంది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ నూతన పార్టీని ప్రకటించారు. పార్టీని ప్రకటించిన అనంతరం తమ జెండా, ఎజెండాను ప్రకటించారు.
హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పలువురు ఉద్యమకారులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పార్టీ ఆవశ్యకత గల కారణాలను నరాల సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణ బిడ్డ ఇకపై కూడా దగా పడకూడదనే లక్ష్యంతోనే తాము ఈ పార్టీని ఏర్పాటు చేశామన్నారు. వందలాది మంది యువకుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడితే ప్రస్తుతం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని అధికార తెలంగాణ రాష్ట్రసమితిపై మండిపడ్డారు. హామీలు నెరవేర్చలేదని, తెలంగాణ దొరల చేతిలో బంధీగా మారిందన్నారు. ఉద్యమ ఆకాంక్షల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా తమ పార్టీ కార్యచరణ ఉంటుందని, తమ మేనిఫెస్టో అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తవించారు.
త్వరలోనే తమ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీ చేరికలు ఉంటాయని, రాబోవు సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎంటీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ గడ్డపై త్వరలోనే రాజకీయంగా పెను సంచలనం సృష్టించబోతున్నామని, ప్రజలంతా హర్షించే భారీ చర్యకు దిగబోతున్నామని సందర్భంగా తెలిపారు. ఆ సంచలనం ఏంటో అందరు చూడబోతున్నారని తమ పార్టీ ప్రయత్నానికి ప్రజలంతా నీరాజనాలు పడతారని చెప్పారు. నూతన పార్టీ ఆవిర్భావ సభలో బుర్ర సోమేశ్వర్ గౌడ్, కూతాడ కుమార్, నాగ కుమారి, విరణ్, జ్యోత్స్న, వెన్నెలరాణి, నవ్య లక్ష్మీ, సీత, మాధవి కుసుమ హరిత తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews