హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా జ‌ర‌ప‌బోతోంది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ భాషా – సాంస్కృతిక, సాహిత్య అకాడమీ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా సాహిత్య దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

CM KCR సూచనల మేరకు గంగా జమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు భాషలలో రాష్ట్రస్థాయి లో 33 జిల్లాల్లో 3 విభాగాలైనా రచనం, పద్యం, ఉర్దూ కవిత్వం లలో కవి సమ్మేళనాలను రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వహించి ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా 1 లక్ష 116 రూపాయల ను, రెండవ బహుమతిగా 75 వేల 116 రూపాయలను, మూడోవ బహుమతిగా 60 వేల 116 రూపాయలను, చతుర్థ బహుమతి గా 50 వేల 116 రూపాయలు, పంచమ బహుమతిగా 30 వేల 116 రూపాయలు బహుమతిగా అందించి కవులను, సాహితి వేత్తల ను ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ కవితలను కలిపి పుస్తక రూపంగా తీసుకురావాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 అకాడమీలను ఏర్పాటు చేసి ఆయా రంగాలలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి వారి అభిరుచులకు అనుగుణంగా ఆయా బాధ్యతలను సీఎం కేసీఆర్ గారు అప్పగించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత తెలంగాణ సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో నేటి తెలంగాణకు గల వ్యత్యాసాలను, జరిగిన అభివృద్ధిని ,ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని, వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో జరిగిన అభివృద్ధి, విద్యుత్, సాగునీటి, త్రాగునీటి, సాంస్కృతిక ,పర్యాటకంగా, క్రీడలపరంగా జరిగిన అభివృద్ధిలపై కవులు ,సాహితి వేత్తలు తమ రచనలను కొనసాగించాలని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్య వేదికను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ , తెలంగాణ సాహిత్య అకాడమీ ల ఆధ్వర్యంలో ఐక్యం చేసి ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి రాష్ట్రానికి వన్నెతెచ్చిన గొప్ప సాహిత్య అభిమాని, స్వయాన కవి అయిన సీఎం కేసీఆర్ గారికి ఘనత దక్కిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాశరథి, కాళోజి గార్ల పేరిట రాష్ట్రస్థాయి అవార్డులను కవులకు, సాహితివేత్తలకు, కళాకారులకు అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కవులు లేరని తెలంగాణ భాష యాస అని విమర్శలు చేసినప్పుడు గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి తన పత్రికలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సుమారు 350 మంది కవుల వివరాలు, వారు రచించిన రచనలు ప్రచురించారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని జూన్ 11వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులను సాహితివేత్తలను గుర్తించి వారిని సత్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలను నిర్వహించాలని తెలంగాణ సాహిత్య వైభవాన్ని దశ దిశల చాటాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈనెల 11వ తేదీన రాష్ట్ర స్థాయి సాహిత్య దినోత్సవం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సాహిత్య దినోత్సవం లో కవులు, సాహితివేత్తలు ఇదే ఆహ్వానంగా భావించి తెలంగాణ సాహిత్య దినోత్సవం లో పాల్గొనాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

#telangana_avatarana_dashabdi_utsavalu
#department_of_language_culture
#telangana_state_formation_celebrations
#RavindraBharathi

ఆవిష్కరణల దిక్సూచి తెలంగాణ!

 

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin