హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
సినిమా దిగ్గజం ఘట్టమనేని కృష్ణ మృతి తీవ్ర ద్రిగ్భాంతిని కలిగించిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. పలు సందర్భాలలో కృష్ణను కలిసిన రోజులను గుర్తుచేసుకున్నారాయన. సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయినట్టయిందని, టాలీవుడ్ జేమ్స్ బాండ్, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు అన్నారు. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నానన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.