🔸 రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులుగా మారిన‌ గ‌ల్ఫ్ కార్మికులు
🔸 ‘గ‌ల్ఫ్‌’ ప్రభావిత ప్రాంతంలో అమెరికన్ ఎన్నారైల రాజకీయ కబ్జా
🔸 ఓట్లు గల్ఫ్ కుటుంబాలవి.. సీట్లు అమెరికన్ ఎన్నారైలవి
🔸 50 మంది సర్పంచులు, 500 మంది వార్డు మెంబర్లుగా గెలిచిన గల్ఫ్ రిటనీలు వారి కుటుంబ సభ్యులు

✍🏻 – మంద భీంరెడ్డి, వలస వ్యవహారాల విశ్లేషకులు, అంతర్జాతీయ వలస కార్మిక నాయకుడు. 

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల నామ సంవత్స‌రం సంద‌ర్భంగా రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు షురూ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్త‌ర తెలంగాణ‌లో తీవ్ర ప్ర‌భావం ఉన్న గ‌ల్ఫ్ కార్మికులు వారి కుటుంబాల పాత్ర ఎన్నిక‌ల్లో కీల‌కం కాబోతున్నాయి. వారి ఓట్లు, వారికి సీట్లు అనే అంశమే ఇప్పుడు ప్ర‌ధానంగా మారింది. ఇప్పటివరకు నిజామాబాద్ ఎంపీలుగా గెలిచిన గడ్డం ఆత్మచరణ్ రెడ్డి, మధు యాష్కీ, కల్వకుంట్ల కవిత అమెరికన్ ఎన్నారైలే. నిజామాబాద్ ప్రాంతం దేశంలోనే అత్యధిక గల్ఫ్ వలసలు కలిగిన ప్రాంతం. గతంలో బాల్కొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఈరవత్రి అనిల్, ప్రస్తుత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా అమెరికన్ ఎన్నారైలే. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ ఎన్నారై.

ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులు చురుగ్గా పాల్గొన్నారు. బొంబాయి – బొగ్గుబాయి – దుబాయి అనే నినాదంతో ఉద్యమించిన గల్ఫ్ దేశాలలోని కార్మికుల పాత్ర మరువలేనిది. బతుకమ్మ, దసరా, బోనాలు సహా అన్ని తెలంగాణా పండుగలను, సాంస్కృతిక కార్యక్రమాలను విదేశాల్లో నిర్వహిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రజలకు అవగాహన కల్పించే పాటలతో ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను పెంపొందించడంలో గల్ఫ్ కార్మికులు, అమెరికా, యూరప్, ఇతర దేశాల ఎన్నారైలు ఎంతో కృషి చేశారు.

గల్ఫ్ కార్మికులు ఉద్యమంలో ముందున్నప్పటికీ అమెరికా తదితర దేశాల వారి కంటే తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో వెనుకబడ్డారు. రాజకీయాల్లో ఎన్నారై కోటాను అమెరికాలో ఉండే ఎన్నారైలే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఈ విధంగా అమెరికా, యూరప్ తదితర దేశాలకు చెందిన 50 మంది వరకు ఎన్నారైలకు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చారు.

గల్ఫ్ నేతలకు టికెట్లు
గల్ఫ్ ప్రవాసీయులకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అందులో భాగంగా గల్ఫ్ కార్మిక నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి వేములవాడ లేదా కోరుట్ల టికెట్ ను ఆశిస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు జగిత్యాల టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గల్ఫ్ రిటనీ, వలస కార్మిక ఉద్యమనేత నంగి దేవేందర్ రెడ్డి బిజెపి నుండి మక్తల్ లేదా నారాయణ్ పేట టికెట్ ఆశిస్తున్నారు. ఒకప్పుడు దుబాయి లో పనిచేసి వచ్చి, జ‌డ్పీటీసీగా గెలుపొంది, గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్ నుండి బీజేపీ టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు.

భారీ నామినేషన్లు 
పసుపు బోర్డు తరహాలో… గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ సాధన కోసం ఎన్నికలను ఎత్తుగడగా ఉపయోగిస్తూ… తెలంగాణ లోని గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు వేయాలని గల్ఫ్ వర్కర్స్ పొలిటికల్ ఫోరం సమాలోచనలు చేస్తున్నది. మరోవైపు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మిక నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ వలసల అంశాన్ని ప్రముఖంగా పొందుపరచడానికి అంతర్గత కమిటీలను కూడా వేసుకుంటున్నాయి.

ఒక కోటి ఓటు బ్యాంకు కలిగిన గల్ఫ్ కార్మికుల సమూహం రాజకీయ అడుగులు వేస్తున్నది. సుదూర ఎడారి దేశాల నుండి గ్రామాల వరకు గల్ఫ్ గాలి వీస్తున్నది. భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న గల్ఫ్ కార్మికులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

స్మార్ట్ ఫోన్లే ఆయుధాలు 
రాజకీయ యుద్ధానికి స్మార్ట్ ఫోన్లు ఆయుధాలు కాబోతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఈమో లాంటి యాప్ లను ఉపయోగించడానికి గల్ఫ్ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు విలేజ్ డయాస్పోరా (గ్రామ ప్రవాసి) వాట్సప్ గ్రూపుల ద్వారా రాజకీయంగా సంఘటితమవుతున్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న వలస కార్మికులు ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోవడం వీలు కానందున వాట్సాప్ గ్రూపులను రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గల్ఫ్ ఓటర్ల ప్రభావం గురించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె) ఒక సంవత్సరం క్రితం… మార్చి 2022 లో సర్వే చేయించి 32 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా కేసీఆర్ కు ఇచ్చినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్, ఓల్డ్ సిటీ లోని నియోజకవర్గాలను ఇందులో చేర్చలేదు. ఈ మేరకు కేసీఆర్ తగిన చర్యలు చేపట్టకపోతే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ‘గల్ఫ్ గండం’ ఉంటుందని పికె నివేదిక సారాంశం. అయినా కేసీఆర్ గల్ఫ్ విషయంలో పీకే మాటను ఖాతరు చేయలేదు. గల్ఫ్ కార్మికులకు ఓట్లు లేనందున వారిని కెసీఆర్ పట్టించుకోవడం లేదని తెలిసింది.

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు టీం కూడా ఇటీవలి కాలంలో దాదాపు ఇదే విధమైన నివేదికను టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి ఇచ్చినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి తన పర్సనల్ ఆర్ఆర్ టీం ద్వారా  క్రాస్ చెక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి  పాదయాత్రలో వేములవాడ, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

నేతల గల్ఫ్ ప్రయాణాలు 
బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల దుబాయిలో పర్యటించారు. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన పాదయాత్రలో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాలను కలిశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలలో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను ఓడించి బీజేపీ గెలుపొందడంలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రాధాన్యతను బీజేపీ గుర్తించింది.

బీఎస్పీ తెలంగాణ ఇంచార్జి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల దుబాయిలో పర్యటించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన జగిత్యాల జిల్లా పర్యటనలో గల్ఫ్ కార్మికుల సమస్యలపై  మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండంలో గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ గల్ఫ్ సమస్యల పోరాటంలో ముందున్నది. గత పదేళ్లుగా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గల్ఫ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

32 సెగ్మెంట్లలో పార్టీలకు గల్ఫ్ గండం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లోని 32 అసెంబ్లీ స్థానాలలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉంటుందో పొలిటికల్ ఏజెన్సీలు పరిశీలన జరిపాయి. ఓటర్ల సంఖ్యను బట్టి ఎక్కువ ప్రభావం, ఓ మోస్తరు ప్రభావం అనే ఏ, బీ అనే రెండు క్యాటగిరీలుగా వర్గీకరించారు.

క్యాటగిరి-ఏ లో 14 నియోజకవర్గాలు (25 నుండి 30 వేల ఓట్ల ప్రభావం): నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్

క్యాటగిరి-బి లో 18 నియోజకవర్గాలు (10 నుండి 20 వేల ఓట్ల ప్రభావం): ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి

రాజ్యాధికారం దిశగా..
తెలంగాణ లోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్ఆర్ టిపి, ఫార్వర్డ్ బ్లాక్ లు గల్ఫ్ కార్మిక కుటుంబాల ఓటు బ్యాంకు, వారి ప్రభావాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయని గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అన్నారు. “మీ జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు.. మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి” అనే నినాదం స్ఫూర్తితో గల్ఫ్ కార్మిక కుటుంబాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు.

ఖరీదయిన కార్పొరేట్ రాజకీయ శక్తులను అడ్డుకొని సామాన్యులు అధికారం పొందే దిశగా కనీస ఖర్చుతో రాజ్యాధికారం పొందడానికి గల్ఫ్ వర్కర్స్ పొలిటికల్ ఫోరం సమాలోచనలు చేస్తున్నదని గల్ఫ్ జేఏసీ కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. ఇప్పటికే గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తెలంగాణలో 50 మంది సర్పంచులు, 500 మంది వార్డు మెంబర్లుగా గెలుపొందారని, మరికొందరు మునిసిపల్ కౌన్సిలర్లుగా, ఎంపీటీసీ లుగా, జెడ్పీటీసీ లుగా, మండలాధ్యక్షులుగా గెలుపొందారని ఆయన అన్నారు.

స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ, పట్టణ పరిపాలన సమర్థవంతంగా చేస్తున్న గల్ఫ్ రిటనీలకు అంతర్జాతీయ స్థాయి అవగాహన ఉన్నది. వీరు స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ, పార్లమెంటు లాంటి చట్ట సభలకు వెళ్ళడానికి అర్హులని గల్ఫ్ జేఏసీ ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి అన్నారు.

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాత్రం గ‌ల్ఫ్ కార్మికుల ఓట్లు, సీట్లు అనే అంశం మాత్రం కీల‌కంగా ఉండ‌బోతోందని చెప్పొచ్చు.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin