న్యూజెర్సీ: మ‌న అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ (MATA) ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. న్యూజెర్సీలో రాయ‌ల్ అల్బ‌ర్ట్స్ ప్యాలెస్‌లో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ఎన్నారై నారీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బిగ్‌బాస్ ఫేం ఆర్జే కాజ‌ల్ యాంక‌రింగ్ అల‌రించింది. సింగర్ దీప్తి నాగ్ పాడిన పాట‌లు మ‌హిళామ‌ణుల‌కు ఉత్తేజాన్ని క‌లిగించాయి. ‘మాటా’ ప్రెసిడెంట్ శ్రీ‌నివాస్ గ‌నగోని మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు రూపొందించి మ‌హిళ‌లంద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో మ‌హిళ‌లు ప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నార‌ని ఆయ‌న కొనియాడారు.

ఈ సంద‌ర్భంగా హింస‌కు గురవుతున్న మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న ‘మాన‌వి’ సంస్థ‌ స‌భ్యుల‌ను ‘మాటా’ స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు. మ‌హిళ‌ల కోసం వారు చేస్తున్న‌ సేవ‌ల‌ను కొనియాడారు. అమెరికాలో ఎంతోమందికి క్లాసిక్ డాన్స్ స్కూల్ ద్వారా సేవ‌లు చేస్తున్న‌ నృత్య క‌ళాకారిణి స్వాతి అట్లూరిని ఈ సంద‌ర్భంగా స‌న్మానించారు.

ఈ వేడుక‌ల్లో చైర్ మంజ‌రి వెల్లురి, కో-చైర్ ల‌త‌దేవి మ‌దిశెట్టి, దీప్తి నాగ్, క‌ల్యాణి బెల్లంకొండ‌, క‌మ‌ల బుద్ది, క‌ల్ప‌న దొప్ప‌ల‌పుడి, అడ్వైజ‌ర్స్ స్వాతి అట్లూరి, కృష్ణ‌శ్రీ గంధం, మంజుల గ‌న‌గోని, స‌భ్యులు జ‌ల‌జ‌, చైత‌న్య‌, మ‌ల్లిక అరుంధ‌టి, కీర్తిరెడ్డి, వాని, శిరీత‌, శిరీష త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాటా ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్స్ పాల్గొన్నారు. ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ శ్రీ‌నివాస్ గ‌నగోని, ఫౌండ‌ర్ అండ్ అడ్వైజర్ ప్ర‌దీప్ సామ‌ల‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ ,జనరల్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ గుడురు, డా. విజ‌య‌భాస్క‌ర్ త‌దిత‌రులు పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేశారు.

By admin