చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగింది. ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీనివాసనంద స్వామి శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యాన‌ర్‌ను లాంచ్ చేశారు. అనంత‌రం ఈ సినిమా టీజ‌ర్‌ను దర్శకనిర్మాత లయన్‌ సాయి వెంకట్, వ్యాపార‌వెత్త ఎస్వీయు నాయుడు టీజ‌ర్ విడుద‌ల చేశారు. హీరో సుమన్, ఆధ్యాత్మిక గురు యాద్దనపూడి దైవాధీనం, పిట్ల మనోహర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

ఈ సంద‌ర్భంగా సుమ‌న్ మాట్లాడుతూ.. ”మీలో ఒకడు” సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంది. సినిమా ఎంతో బాగా వచ్చింది. ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. కుప్పిలి శ్రీనివాస్ సినిమాను ఎక్క‌డా కంప్రమైస్ కాకుండా తీశారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాను. నేను 44 సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నాను. నా నిర్మాతలకు అన్ని విభాగాల‌కు చెందిన‌వారికి, నా అభిమానులకు నా పాదాభివందనం.

హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుమన్ గారు నాకు జీవితంలో మర్చిపోలేని సినిమా ఇచ్చారు. నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడం మాకు ఎంతో అదృష్టం. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు సినిమాకు ఎంతో విలువైన‌వి. సినిమాను చాలా ఇష్టంగా చేశాను. మంచి టెక్నిషియన్స్‌తో ఈ సినిమా చేసాము. ప్రేక్షకుల దీవెనలు మా సినిమాపై ఉండాలని ఆశిస్తున్నాము అన్నారు. మా ఊరు సర్పంచ్ నాయుడు గారు లేకపోతే నేను లేను.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… సినిమాలకు వెళ్లి చూసే వారిలో యూత్, మాస్ అధికంగా ఉంటారు. అలాంటి యూత్, మాస్ ఆడియ‌న్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ”మీలో ఒకడు”. మానవీయా కోణంలో సుమన్ ఈ సినిమా చేశారు. తండ్రి పాత్ర‌లో చేశారు. అలాంటి సీనియ‌ర్ న‌టుడు న‌టించిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డం ఖాయం. ఇక‌ ఇంత మంది స్వామిజీ ఆశీస్సులు కూడా ఈ సినిమాకు ఉండ‌టం అదృష్టం.

ద‌ర్శ‌క‌నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ… సుమన్ గారు ఈ సినిమా చేయడం ఎంతో గొప్ప విష‌యం. దేవ‌త‌ల రూపం అంటే నాడు ఎన్టీఆర్ గుర్తొచ్చే వారు. అన్న‌మ‌య్య త‌ర్వాత వెంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే ఇప్ప‌టికి, ఎప్పటికి గుర్తుండే అన్నమయ్య పాత్ర. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు సుమ‌న్ గారు. కుప్పిలి శ్రీనివాస్ ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి ”మీలో ఒకడు” సినిమా చేశాడు. ఎంతో ఎదుగుతున్నాడు. రాబోయే రెండుమూడేళ్ల‌లో మ‌రెంతో ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను.

ఫైట్ మాస్టర్ హంగామా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు హంగామా కృష్ణ పాత్రను కుప్పిలి శ్రీనివాస్ గారు సెట్ చేశారు. ఫైట్ మాస్ట‌ర్‌గా చేస్తూనే మెయ‌న్ విల‌న్ పాత్ర చేశాను. ప్ర‌తి సంద‌ర్భంలో సుమన్ గారు ఎన్నో విలువైన‌ సలహాలు ఇచ్చారు. ఆయ‌న‌కు పాదాభివంద‌నం.

న‌టీనటులు: లయన్ కుప్పిలి శ్రీనివాస్ (హీరో), హ్రితిక సింగ్ , సాధన పవన్ (హీరోయిన్స్)
రచయిత : శివప్రసాద్ ధరణికోట
పర్యవేక్షణ : కె.ప్రశాంత్
కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్
డి.ఓ.పి : పొడిపి రెడ్డి శ్రీను
మ్యూజిక్ డైరెక్టర్ : జై సూర్య
పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, జై సూర్య
సింగర్స్ : సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు
ఫైట్స్ : హంగామా కృష్ణ
ఎడిటర్ : ప్రణీత, ఎన్టీఆర్
నిర్మాణం: లయన్ కుప్పిలి వీరాచారి

కథ , ఐడియా ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : కుప్పిలి శ్రీనివాస్

By admin