మా అన్నయ్య చిరంజీవికిఓ అభిమాని నిష్టూరమైనా నిజంగాకష్టమైనా వాస్తవాలను విడమరచి చెప్పేలాఒక బహిరంగ లేఖ..
అన్నయ్యా మీరు ఈ మధ్య పదే పదే మీ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు
కాదనడం లేదు..
కానీ
ఒక మెగాస్టార్ గా మరింత నిలదొక్కుకోడానికి
ఇటీవల మీరు దర్శకులపై చేస్తున్న సంచలన వ్యాఖ్యలకూ
మీకూ అసలు పొంత ఉందా? అని చూసుకుంటే..
అన్నయ్యా నిజం చెప్పండీ
మీతో చేసే దర్శకులను మీరు నిజంగానే దర్శకత్వం చేయనిస్తారా?
దర్శకులు వారి పని తీరుపై మీరు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారే..
వాళ్ల వాళ్ల వర్కింగ్ స్టైల్ పై వ్యంగ్యాస్త్రాలను ఎక్కు పెడుతున్నారే..
వాటిలో మీ తాలూకూ ఎక్స్ ప్రెషన్ కన్నా ఫ్రస్టేషన్ ఎక్కువగా కనిపిస్తోంది.. అన్నయ్యా
ఇది నిజం నిజం నిజం..
———-
నిజానికి చిరంజీవి దర్శకులు.. వారి అభిమతాలు- అవగతాలను ఒక సారి పరిశీలిస్తే..
ఇండస్ట్రీకే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒక వీవీ వినాయక్, మరో పూరీ ఇంకో మురుగదాస్ వంటి వారిని అడిగితే అసలు విషయం చెబుతారన్న మాట ఇండస్ట్రీలో బాగా ప్రచారంలో ఉంది..
చిరంజీవికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావ్ కే, వంటి వారి గురించి తెలీదు… కానీ చిరంజీవికి డైరెక్షన్ అన్నా స్క్రిప్ట్ అన్నా ఎక్కువ మక్కువ. చాలా జాగ్రత్తలే పాటిస్తారాయన. దానికి తోడు ఏ మాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర తన రికార్డులు.. ఇతర మార్కెట్ అప్ అండ్ డౌన్స్ మీద కూడా ఆయన చాలానే కాన్షస్ గా ఉంటారట..
చిరంజీవికి మార్కెట్ పిచ్చి బాగా ఎక్కువ..
ఆయన మార్కెట్ నెట్ వర్త్ విలువ అక్షరాలా 350 కోట్లుగా చెబుతుంటాయి.. గణాంకాలు
అందుకే ఆయన పదేళ్ల పాటు తన రాజకీయ విన్యాసాలన్నీ పూర్తి చేసి..
ఇక అటు వైపు కనీసం చూడకూడదని ఒక ప్రతిజ్ఞ చేసినట్టు సమాచారం..
బీజేపీ తొలుత చిరంజీవినే రంగంలోకి దించాలనుకుంది.. కానీ ఆయన ససేమిరా అనడంతోనే ఎన్టీఆర్ జూనియర్ వైపు మొగ్గు చూపినట్టు ఒక భోగట్టా..
దీన్నిబట్టీ చెప్పొచ్చు.. చిరు తన సెకెండ్ ఇన్నింగ్స్ పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నారో..
ఇవన్నీ అలా ఉంచితే..
చిరంజీవి సినిమా- దర్శకుల పాట్లు అన్న ఒకానొక విషయానికి వస్తే..
ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వీవీ వినాయక్ కు ఠాగూర్ ను డైరెక్ట్ చేసే చాన్సు వెతుక్కుంటూ వచ్చింది.. ఆయన కూడా మా అన్నయ్య, కన్నయ్య అనుకుంటూ ఎగిరి గంతేసుకుంటూ వెళ్తే అక్కడ ఆశ నిరాశే ఎదురైనట్టు సమాచారం..
చిరంజీవి తమిళ రమణ స్క్రిప్టు తెలుగీకరణలో వేలు కాళ్లు పెట్టడమే కాకుండా ఏకంగా ఆవహించేశారట… అసలు దర్శకుడిని కూడా దాదాపు పక్కన పెట్టినంత పనిగా చెబుతారు. అంతే కాదు.. చిరంజీవి తనే దర్శకత్వం చేయడం మాత్రమే కాదు. వినాయక్ కి ఒక చిన్న పాత్ర ఇచ్చి.. సెట్ లో ఒక మూలకు వినాయక్ ను పరిమితం చేసినట్టు అప్పట్లో టాలీవుడ్ గుస గుస. ఠాగూర్ దర్శకత్వం తన పాత్ర.. అనే అంశంపై అప్పట్లో వినాయక్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టూ సమాచారం..
ఇక పూరి సంగతి సరే సరి..
పూరి అయితే ఇడియట్ హిట్ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేద్దారని..
ఓ ఆశపడి ఎళ్తే.. అక్కడ పూరికి జంతికలు పెట్టినట్టే పెట్టి..
వాటినెలా నమిలి తింటారో పూరిని కూడా చిరు అలా నమిలి మింగేశారనీ..
ఇడియట్ లాంటి అర్ధం పర్దం లేని చోటా మోటా సినిమాలను డైరెక్ట్ చేసే నువ్వా నన్ను డైరెక్ట్ చేసేదని చెడుగుడు ఆడేశారనీ.. దీంతో ఆ స్క్రిప్టును సింక్ కాకున్నా.. జూనియర్ ను పెట్టి ఆంధ్రావాలాగా లాగించేశారనీ ఒక స్టోరీ ఫిలింనగర్ వీధుల్లో చక్కర్లు కొట్టింది అప్పట్లో..
ఇక స్టాలిన్ కి ఏఆర్ మురుగదాస్ ఒక దర్శకత్వ అసంతృప్తి అనే ఎపిసోడ్ కి వస్తే..
గజనీ లాంటి భారీ నేషనల్ సెన్సేషన్ ఇచ్చిన మురుగదాస్ కు చిరంజీవిని డైరెక్ట్ చేయడం అనే అంశం
తల ప్రాణం తోకలోకి రావడం.. ఆయన పూరా అలిగి వెళ్లిపోతే.. ఆఖరున ఈ సినిమా రిమైనింగ్ షూట్ పార్ట్ ను మలినేని గోపీ చంద్ దర్శకత్వం వహించాడన్నది టాక్ ఆఫ్ టాలీవుడ్..
ఇక రీసెంట్ రిలీజ్ ఆచార్య..
ఈ సినిమా కథ తొలుత ఒకటి అనుకుంటే
ఆ తర్వాత అది మరొకటిగా మారిందని కొరటాల తన ఇన్నర్ సర్కిల్స్ లో చెబుతోన్న మాట..
మొదట ఈ చిత్రంలో చిరు పాత్ర ఒక దేవాదాయ శాఖ అధికారిది కాగా.. దాన్ని నక్సల్ బ్యాక్ డ్రాప్ లోకి తీసుకెళ్లడం వంటి ఎన్నో మార్పు చేర్పులకు తనకు సంబంధమే లేదంటారు శివ..
ఆఖర్న ఈ కథ ఇలా మారడానికి రాజమౌళి సలహా సూచనలే కారణమని.. చిరంజీవి చేసిన మేనేజ్మెంట్ ఆచార్య ఫంక్షన్లో కొట్టొచ్చినట్టు కనిపించింది… ఇందుకు కొరటాల శివ మొహం మాడ్చుకోవడమూ అందరూ చూసే ఉంటారు..
ఈ క్రమంలో చిరంజీవి తరచూ దర్శకుల మీద వేసే సెటైర్లు కామెంట్లకు అంత విలువ ఉందా? అన్నదొక డిబేటబుల్ పాయింట్..
చేయాల్సిందంతా చేసి.. ఏమీ తెలియనివాడిలా ఆయన మాట్లాడే మాటలకు ఒక అర్ధముందా?
అన్న ప్రశ్న లోలోపల ఒక్కొక్కరిలో ఉడికి పోతోందట..
నిజానికి ఒక సినిమా హిట్ దానికి చివర్లో అద్దే మెరుగులతో మాత్రమే సాధ్యమన్నది ప్రస్తుత దర్శకులంతా కలసి ఏకగ్రీవంగా అనేమాట..
ఫైనల్ స్క్రిప్ట్ లాక్ కన్నా.. స్పాట్ ఇంప్రవైజేషనే సినిమాకు గట్టి పట్టునిస్తుంది.. అని అంటారు..
నిజానికి చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఉవ్విళ్లూరే సుకుమార్.. చిరంజీవిని ఇప్పటి వరకూ దర్శకత్వం వహించని కృష్ణవంశీ, వర్మ వంటి బ్యాచ్..
ఇక చిరంజీవికే భయమున్న దర్శకుడు రాజమౌళి..
మొన్నీమధ్య రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన వల్ల కాదని ముందే చేతులెత్తేశారు చిరంజీవి..
ఇలా చిరంజీవి దర్శకుల ఎపిసోడ్ చాలా చాలా పెద్దది..
బేసిగ్గా చిరంజీవికి దర్శకులు వారి మనోభావాలు అనే విషయం కన్నా..
తాను తన సినిమా మార్కెట్ అనే పదార్ధం మీదే ఎక్కువ మక్కువ.. ఈ విషయం మొన్నటి మురారి అనే సీనియర్ నిర్మాత నుంచి నిన్నటి బండ్ల గణేష్ అనే యువ నిర్మాత వరకూ అందరిదీ ఒకటే మాట..
అమ్మో చిరంజీవికి కథా.. అయితే మురుగదాస్ లేకుంటే రాజూహిర్వాణీ లాంటి మార్కెట్ ఓరియెంటెడ్ కథా రచయితలు చెబితేనే.. ఒక వేళ నీలాంటి చోటా మోటా చెప్పినా.. నీ పేరు బయటకు ఎక్కడా రాకుండా జాగ్రత్త వహిస్తారు.. అంత మార్కెట్ యావ.. అంటూ వీరు బాహటంగానే కామెంట్లు చేస్తుంటారు..
మార్కెట్ పరిధి విస్తరణ దాని పట్ల ఉన్న శ్రద్ధాసక్తులు వెరసీ.. చిరంజీవి తన చిత్రాన్ని తాను అత్యంత జాగ్రత్త వహిస్తుంటారు..
అంటే ఒక రకంగా కథ కథా కోణంలో కాకుండా
సినిమాను సినిమా యాంగిల్లో తీయకుండా..
24 ఇంటూ సెవన్ మార్కెట్ పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచించి రచించి దర్శకత్వం వహించడం మెగా మార్క్ మేకింగ్ స్టైల్..
ఆయనకు సాధ్యం కానిది … కథకు విపరీతమైన విలువ ఉందని నమ్మడం..
అందుకే చిరు సినీ జీవితంలో ఒక విక్రం రానే రాదు..
కారణం తెర నిండా తానే పరుచుకుపోవాలన్న తపన తాపత్రయం ఆయనకు బాగా ఎక్కువ..
అదే తన మూవీ మార్కెట్ మంత్రగా ఆయన గట్టి నమ్మకం
బాలకృష్ణలా ఆయన ఎప్పటికీ దర్శకుల మానాన దర్శకులు సినిమాలు తీసుట అనే ప్రక్రియకు పూర్తి విరుద్దం..
అందుకే బాలకృష్ణకు ఒక్కోసారి భారీ ఫ్లాపులు పడుతుంటాయ్..
అందుకే చిరంజీవి ఫ్లాప్ సినిమా కూడా మినిమం గ్యారంటీగా ఉంటుంది..
కానీ అదంతా గతం
ఇప్పుడు వర్తమానంలో దర్శకులు కూడా భారీగానే ఇంప్రూవ్ అయ్యారు..
హీరో బేస్డ్ మూవీస్ ని మాత్రమే రాసుకోవడం లేదు..
కథాపరమైన జాగ్రత్తలు చాలానే తీసుకుంటున్నారు..
ఎంత పెద్ద హీరో అయినా దాన్నొక పాత్రగానే రాసుకుంటున్నారు..
అందుకు వకీల్ సాబ్ సినిమానే ఉదాహరణ.. ఈ సినిమాలో హీరో పాత్ర కేవలం యాభై నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది..
ఇటీవలి కమల్ బ్లాక్ బస్టర్ విక్రం సినిమాను తీసుకుంటే
హీరో పాత్ర సినిమాలో సగం వరకూ కనిపించదు..
ఇలాంటి త్యాగం చిరంజీవి తన జీవిత కాలంలో దాదాపు చేయలేరనే చెప్పాలి..
చిరంజీవికి తెర నిండా తానే ఉంటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారన్న అభిప్రాయం బలంగా గల అగ్రనటుడు..
కానీ ఇక్కడ వింత ఏంటంటే.. చిరంజీవిని చూడ్డానికి ఇప్పుడెవరికీ పెద్ద ఆసక్తి లేదు..
కారణం.. ఆయన పదేళ్ల పాటు జనంలో కలయదిరగడంతో వారికి చిరును- చూడాలని ఉంది అనే ఇంట్రస్ట్ దాదాపు తీరిపోయిందనే చెప్పాలి..
అందుకే చిరంజీవి..
ఈ కాలంలోకి రావాలి..
ఇప్పటి దర్శకుల ప్రతిభా పాటవాలను పరిగణలోకి తీసుకోవాలి..
ఎప్పటిలాగానే తన స్క్రిప్టు తనే రాసుకుని తన దర్శకత్వం తానే వహించుకోవాలన్న అభిప్రాయంలోంచి బయట పడితేనే ఇండస్ట్రీ హిట్స్ తిరిగి ఇవ్వగలరు..
లేదంటే.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోయే ప్రమాదం అత్యంత దగ్గర్లోనే..
మెగాస్టార్ ఈ చిరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు
–
ఇట్లు మీ వీరాభిమాని!