హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
సత్యశోధక్, తొలి ఉత్తమ విద్యార్థి, మహిళా రచయిత ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’ 183వ జయంతి ఉత్సవాలు మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ భాషా సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. కేవలం 3 సంవత్సరాల పాఠశాల విద్యాభ్యాసం ద్వారా 14 సంవత్సరాల వయస్సులోనే వివక్ష, అణచివేత లాంటి విస్తృత భావనలను అర్థం చేసుకొని, ‘మాంగ్ మహారాచి దుఃఖవిశాయి (1855)’ అనే వ్యాసంతో బలహీనవర్గాలపై ఆధిపత్య వర్గాలవారు చేస్తున్న క్రూరత్వాలను ప్రపంచానికి బహిర్గతం చేసి, విద్యా జ్ఞానమే అన్ని సమస్యలకు దివ్య ఔషధం అని మొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన తొలి భారతీయ మహానుభావురాలు సావిత్రిబాయికి చెందిన ఉత్తమ విద్యార్ధి ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’ నుంచి ప్రేరణ తీసుకోని ప్రజలందరూ ముందుకు వెళ్లాలని సూచించారు.
మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ మాట్లాడుతూ.. ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’ జీవితం నేటి సమాజానికి కూడా గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. మాంగ్ కుల మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలని ప్రభుత్వాన్ని కోరారు. తమ మాంగ్ కులం పత్రం తహశీల్దార్ కార్యాలయం ద్వారా మాత్రమే జారీ చేయాలని కోరారు. గతంలో ఎవరైనా ఇతర కులంతో కులం పత్రం పొంది ఉంటె వారికీ, మళ్ళీ మాంగ్ కులం పేరుతొ కులం పత్రం పొందడానికి అవకాశం కల్పించాలని, ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న మాంగ్ కులం ప్రజలకు గతంలో వారి వ్యవసాయ భూములకు జారీచేసిన పహాణీలను పునఃరుద్ధరించి, న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాంగ్ కులం వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, మాంగ్ సమాజ్ ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం హైదరాబాద్ లో అనువైన స్థలం కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వాగ్మారే మాయాదేవి, హెడ్ డిపార్ట్మెంట్ అఫ్ హిందీ, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రముఖ దళిత ఉద్యమ చైతన్య కర్త, జెబి రాజు, సామజిక కార్యకర్త , బాలాజీ తోట్వె (మహారాష్ట్ర), మాసారం ప్రేమ్ కుమార్, సిజెఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మాంగ్ సమాజ్ నాయకులు కాంబ్లే శంకర్ మాంగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గాయ్ కాంబ్లే గోవింద్ మాంగ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, గాడేకర్ పరశురామ్ మాంగ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, దత్త మోహాలే మాంగ్ మాంగ్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, కాంబ్లే సుధాకర్ మాంగ్, హైదరాబాద్ మహానగరం కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర నలుమూలల నుంచి మాంగ్ సమాజ్ బంధువులు హాజరయ్యారు .
* * *
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండిhttps://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews