సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్ల గ్రామం లో సంక్రాంతి పండుగ ని పురస్కరించుకొని చైతన్య యువజన మండలి (CYC) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించేందుకు ముఖ్య అతిధులుగా చందుపట్ల గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులుగా, గ్రామ పంచాయతీ సిబ్బంది గా దశాబ్దకాలంకి పైగా పని చేస్తున్న నల్గొండ వెంకన్న, కోడి ఉప్పలయ్య సంయుక్తంగా పాల్గొని జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా చైతన్య యువజన మండలి సభ్యులు పారిశుద్య కార్మికులను శాలువలతో సత్కారించటం జరిగింది.క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆటలు ఆడాలని, మానసిక, శారీరక ధ్రుడత్వానికి క్రీడలు దోహధపడుతాయని, స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతున్నదని ఈ సందర్బంగా తెలిపారు.

ప్రధమ బహుమతి : 12,000/- +షీల్డ్

ద్వితీయ బహుమతి : 10,000/- + షీల్డ్

తృతీయ బహుమతి : 8000/-+ షీల్డ్

చతుర్థి బహుమతి : 6000/-+ షీల్డ్

పంచమి బహుమతి : 4000/-+షీల్డ్
మరియు ప్రత్యేక బహుమతులు
బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫిల్డర్, బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ ఆల్ రౌండర్ ప్రకటించారు.ఎంట్రీ ఫీజ్ = 300/- రూపాయలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో చైతన్య యువజన మండలి గౌరవ అధ్యక్షులు అనంతుల మధు, అధ్యక్షులు భాషిపంగు సునీల్, కార్యదర్శి కొలికపంగు వాసు,
చందుపట్ల గ్రామ ఎంపీటీసీ కోడి బండ్లయ్య, గ్రామ పెద్దలు పొనుగోటి సిత రామ రావు, కోడి సురేష్, కోడి లక్ష్మణ్, కేయ్యాల రాజ్ కుమార్, గుద్దేటి శ్రవణ్, భూక్యా నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

By admin