◉ గల్ఫ్ వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని వినతి

Hyderabad (MediaBoss Network): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13, 14 రెండు రోజులు గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి పర్యటించనున్న సందర్భంగా గల్ఫ్ కార్మికుల పక్షాన టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఒక లేఖ రాశారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ స్వదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని కోరారు.

సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులతో జనవరి చివరి వారంలో దుబాయిలో సంప్రదింపుల సమావేశం నిర్వహించి గల్ఫ్ కార్మికుల కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,సామాజిక భద్రతా పథకాల గురించి చర్చించారు. భారత్ – గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కోరికలతో కూడిన నివేదిక తయారు చేశారు. “అహ్లాన్ మోడీ” బహిరంగ సభ, బాప్స్  హిందూ దేవాలయం ప్రారంభోత్సవం సందర్బంగా గల్ఫ్ ప్రాంతంలో పనిచేసే వలస కార్మికుల సంక్షేమానికి పథకాలు ప్రకటించాలని మంద భీంరెడ్డి ఆ లేఖలో కోరారు.

◉ ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. ఈసీఆర్, ఈసీ ఎన్నార్ అనే రెండు రకాల పాస్ పోర్టు దారులకు బీమా సౌకర్యం కల్పించాలి. రెండు రకాల పాస్‌పోర్ట్ వర్గీకరణను రద్దు చేసి ఒకే రకం  పాస్‌పోర్ట్ ను ఇవ్వాలి.

◉ గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.

◉ వాపస్ వచ్చే వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.

◉ ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి.

◉ ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.

◉ గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.

◉ విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ – పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.

◉ విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం లాగా రెండున్నర శాతం ప్రోత్సాహకం అందించాలి.

◉ భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే  విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి.

◉ భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.

◉ ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు.

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin