నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం చల్లవోణికుంట, మెల్లవోయ్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి.. అభివృద్ధికి మరింత అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎకరాకు రూ. 10 వేల రైతు బంధు ఇస్తూ,అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే గుంట భూమి ఉన్నా.. రూ. 5 లక్షలు రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.
కళ్యాణాలక్ష్మి, షాదీముబారాక్ లాంటి పథకాలతో పేదింటి అడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని పేర్కొన్నారు. గతంలో రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచారని గుర్తు చేశారు. తాజాగా 10 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్టాల్లో అమలు చేయటం లేదన్నారు. చాలా రాష్టాల ప్రజలు తెలంగాణ లాంటి పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మోటర్లకు మీటర్లు పెట్టె బీజేపీని ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. నల్లా చట్టాలు తెచ్చి రైతులకు అన్యాయం చేయాలని ప్రయత్నించిన బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదన్నారు. డీజిల్,పెట్రోల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్న బీజేపీ పార్టీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని కోరారు. గ్రామ గ్రామాన ప్రజలు గులాబీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల ఆశీర్వాదాలు టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయన్నారు.
మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు కేంద్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బీజేపీకి గుణపాఠం కావాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తేనే ప్రజల మన్ననలు పొందుతారని, టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తారని అన్నారు.
బీజేపీ అంటేనే అబద్ధాలు, విష ప్రచారాలు చేసే పార్టీ అని ధ్వజమెత్తారు. అభివృద్ధి పథంలో పయనిస్తూ అనేక రంగాల్లో అవార్డులు సాధిస్తున్న తెలంగాణ అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉండి రాష్టాన్ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఆలోచించండి… పనిచేసే వారికి ఓటు వేయండని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి