మునుగోడు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు, నాయకుల కొనుగోళ్లు, రాజకీయ పార్టీలు పోటీపడి పెడుతున్న ఖర్చుతో రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది. జెండాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ధావత్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వాహనాలతో మునుగోడు నియోజకవర్గమంతా నువ్వా నేనా? అనేలా పరిస్థితి నెలకొంది. ఈ నేప‌థ్యంలో ‘మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్’ సంస్థ‌లు తాజాగా స‌ర్వే ఫ‌లితాలు విడుద‌ల చేశాయి. ఈ స‌ర్వే ప్ర‌కారం మునుగోడులో టీఆర్ఎస్ గెల‌వ‌బోతోంది. 41 శాతంతో గులాబీ పార్టీ మొద‌టి స్థానంలో ఉంది. ఇక బీజేపీ 33 శాతంతో రెండ‌వ స్థానంలో నిలిచింది. మూడ‌వ స్థానంలో కాంగ్రెస్ 21 శాతం ఓట్లు సాధించ‌వ‌చ్చ‌ని స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది. ఇక బీఎస్పీ 2 శాతం, ఇత‌రులు 3 శాతం ఓట్లు సాధించవ‌చ్చ‌ని అంచ‌నా వేసింది స‌ర్వే. టీఆర్ఎస్ 16 వేల ఓట్ల‌కుపైగా మెజారిటీతో గెలుపొందే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వే తేల్చింది. మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265.

MediaBoss & GameChanzer (Oct 29, 2022 Survey)

  • TRS 41
  • BJP 33
  • Congress 21
  • BSP 02
  • Others 03

మునుగోడు నియోకజవర్గంలో ఏ మండలం ఏ పార్టీకి ఫ్లస్

నారాయణపూర్    బీజేపి లీడ్

మర్రిగూడ             కాంగ్రెస్ లీడ్

చండూర్               బీజేపి లీడ్

నాంపల్లి                టీఆర్ఎస్ లీడ్

గట్టుప్పల్              టీఆర్ఎస్ లీడ్

చౌటుప్పల్             బీజేపి లీడ్

మునుగోడు           టీఆర్ఎస్ లీడ్

ఆయా మండలాల్లో సర్వే అంచనాలు ఇలా ఉన్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి మూడో స్థానంలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపి అభ్యర్థులపై కచ్చితమైన ప్రభావం చూపుతుందని సర్వే అభిప్రాయ పడింది. దీనికి తోడు మునుగోడు కమ్యూనిష్టులకు 12 వేల నుంచి 15 వేల ఓటు బ్యాంకు ఇప్పటికి కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కమ్యూనిష్టులకు ఓట్లు టీఆర్ఎస్ కు బలం అని సర్వే సంస్థ విశ్లేషించింది.

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సర్వే నిర్వహించారు. సర్వేలో అన్ని మండలాల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్నివర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించామన్నారు. 5 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించి ఓట్ల శాతాన్ని లెక్కించినట్టు వివరించారు. నిజానికి ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. బీసీలు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్టు స‌ర్వే ఫ‌లితాల‌ను బ‌ట్టి స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలో 59 వేల మందికి రైతుబంధు సాయం అందుతున్నది. 40 వేల మందికి నెలనెలా ఆసరా పింఛను లభిస్తున్నది. ఇలా అన్నివర్గాలకు సాయం చేస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామని ఓటర్లు మద్దతు తెలుపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇక‌ మునుగోడు పోలింగ్ 3వ తేదీన జరగనుండగా.. 6వ తేదీన కౌంటింగ్ జరగనుంది.

 

 

By admin