జ‌గిత్యాల (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సమగ్ర ఎన్నారై, మైగ్రేషన్ పాలసీలో భాగంగా, తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలని, రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కు వెళ్లిన వలస కార్మికుల పేర్లు తొలగించవద్దని ఆయన కోరారు. ఈ మేర‌కు నరేంద్ర పన్నీరు జగిత్యాల ప్రెస్ క్లబ్ లో గల్ఫ్ వలసల అవగాహన పోస్టర్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ రావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి, భూమి రమణ, మధన్ మోహన్, రాగిల్ల సత్యనారాయణ, పన్నాల తిరుపతి రెడ్డి, బిర్పూర్ మండల OBC మోర్చ అధ్యక్షులు బసవరాజుల సంతోష్, చందుర్తి మండల బీజేపీ ఉపాధ్యక్షుడు వంకాయల కార్తీక్, చందుర్తి మండల బీజేవైఎం అధ్యక్షుడు అంబల శ్రీకాంత్, బీజేపీ కార్యకర్తలు రాజన్న, విఎస్ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి ముఖ్య‌ అతిథిగా పాల్గొన్నారు.

హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నరేంద్ర కోరారు. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుండి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలని, జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలని కోరారు.

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు సహాయం కోసం, సలహా కోసం ఢిల్లీ లోని ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం వారి ల్యాండ్ లైన్ నెంబర్లు +91 11 4050 3090 & +91 11 2688 5021 కాల్ చేయాలని నరేంద్ర సూచించారు. ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు కాల్ చేయవలసిన  టోల్ ఫ్రీ నెంబర్1800 11 3090 హైదరాబాద్ లోని క్షేత్రీయ ప్రవాసి సహాయత కేంద్రం +91 40 2777 2557 నెంబర్లకు కాల్ చేయాల‌ని తెలిపారు.

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php 

By admin