1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగిందని దర్శకులు నరసింహ నంది తెలిపారు. పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి

 

నటీనటులు:

అదితి మైకేల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు

 

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: శ్రీలక్ష్మీ నరసింహ సినిమా

నిర్మాతలు: పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ

ప్రొడక్షన్ మేనేజర్: భూక్య బిజెపి నితిన్ బాబు నాయక్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రంగు రాము గౌడ్

సహా దర్శకులు: సురేందర్, రాజబాబు

ఎడిటర్ : వి . నాగిరెడ్డి

సంగీతం: సుక్కు

కెమెరామెన్: మహిరెడ్డి పండుగల

రచన , దర్శకత్వం: నరసింహ నంది

By admin