17వ ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమావేశం 2023 జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగుతుంది.
మొదటి రోజు (8 జనవరి) యువ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తారు.
ప్లీనరీ సెషన్-1: ఆవిష్కరణలు మరియు కొత్త టెక్నాలజీలలో డయాస్పోరా (ప్రవాసి) యువత పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహిస్తారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరు రంగాలకు చెందిన వేరు వేరు సదస్సులు (సెక్టోరియల్ సెషన్స్) నిర్వహిస్తుంది.
రెండో రోజు (9 జనవరి) ప్రవాసి భారతీయ దివస్ ను, డిజిటల్ ఎగ్జిబిషన్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
ప్లీనరీ సెషన్-2: ఇండియన్ హెల్త్‌కేర్ ఎకో-సిస్టమ్ (భారతీయ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ వ్యవస్థ) ను ప్రోత్సహించడంలో భారతీయ డయాస్పోరా (ప్రవాసుల) పాత్ర: అమృత కాలం (రాబోయే 25 సంవత్సరాలు ) విజన్ @2047 అనే అంశంపై చర్చాగోష్టి కి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహిస్తారు.
ప్లీనరీ సెషన్-3: భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ (మృదువైన శక్తిని) ఉపయోగించుకోవడం – హస్తకళలు, వంటకాలు & సృజనాత్మకత ద్వారా సద్భావన అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అధ్యక్షత వహిస్తారు.
ప్రస్తుతం జి-20 దేశాల సమాఖ్యకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అమితాబ్ కాంత్, హర్షవర్ధన్ శృంగల అనే ఇద్దరు జి-20 ఇంచార్జి అధికారులు మరొక సదస్సులో ప్రసంగిస్తారు.
మూడో రోజు (10 జనవరి) ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవం
ప్లీనరీ సెషన్-4: భారతీయ శ్రామిక శక్తి యొక్క ప్రపంచ చలనశీలతకు అవకాశం ఇవ్వడం – భారత ప్రవాసుల పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర విద్య, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహిస్తారు.
ప్లీనరీ సెషన్-5: ప్రవాస మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని దేశ నిర్మాణానికి సమ్మిళిత విధానంలో ఉపయోగించడం అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయి పటేల్ మధ్యాహ్న భోజన విందు ఇస్తారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు సమావేశం, ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.
సమాచార సేకరణ: మంద భీంరెడ్డి
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews