ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముర్ము పేరును అధికారికంగా ప్రకటించారు. ఆదివాసీ మహిళ అయిన ముర్ము 2015-2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్‌ శాఖల మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ముర్ము టీచర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.

By admin