• 50వ వసంతంలోకి సచిన్
  • శుభాకాంక్షలు తెలిపిన సీహెచ్ విద్యాసాగర్ రావు

క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండుల్కర్ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా యావత్ భారతం మాస్టర్ బ్లాస్టర్‌‌‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది. సచిన్ టెండుల్కర్ జన్మదినం సందర్బంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆయనకు విషెస్ తెలిపారు. భారతరత్న సచిన్ టెండుల్కర్ జీవితం ఎందరికో ఆదర్శమని, పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదని నిరూపించారని విద్యాసాగర్ రావు కొనియాడారు. ఈ సందర్బంగా సచిన్ టెండూల్కర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

” భారతదేశం గర్వించేలా తన ఆటతో, తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకున్నారని.. సచిన్ రాకముందు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఉన్న కానీ ప్రపంచ వ్యాప్తంగా అందరూ సచిన్ టెండుల్కర్ ని “గాడ్ ఆఫ్ ద క్రికెట్” గా భావిస్తారు.. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు” అని చెప్పుకొచ్చారు విద్యాసాగర్ రావు.

 

సచిన్ఏ ప్రిల్ 24, 1973న జన్మించాడు. ఆయన ఇప్పటిదాకా 198 టెస్ట్ మ్యాచ్లు ఆడి 15,837 పరుగులు సాధించాడు, అలాగే 463 వన్డే మ్యాచులు ఆడి 18,426 పరుగులు సాధించాడు. నవంబర్ 16 ,2013 న తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి.. అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న అదే సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన “భారత రత్నను” సచిన్ కు ప్రకటించింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు, అత్యధిక టెస్ట్ పరుగులు, అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50-ప్లస్ స్కోర్‌లు చేసినందుకు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఇప్పటికీ రికార్డును కలిగి ఉన్నాడు.

By admin