భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న స‌మ‌యం. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. అంబేద్కర్ స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యులు కబీర్, సంత్ రవిదాస్‌, ఎవరైతే తాము బతికిన కాలంలో ఎంతో మందిని తన భావజాలంతో ప్రభావితం చేస్తారో వాళ్లే చరిత్ర మలుపులో నిలబడి రాబోయే కాలానికి దిశా నిర్దేశం చేస్తారు. ఇలాంటి వారిలో రవిదాస్ ఒకరు. అందుకే ఆయన అనుమాయిలు ఆయన బంగారు విగ్రహాన్ని జలందర్ నుంచి కాశీ వరకూ మోసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభావం పంజాబ్ నుంచి దేశమంతా విస్తరించింది.

సంత్ రవిదాస్ భక్తి కవుల్లో ఒక ఆధ్యాత్మిక భావాన్నే కాకుండా సామాజిక భావాలనూ అభివృద్ధి చేశారు. బానిస భావాలను వ్యతిరేకించారు. మానసిక బానిసత్వాన్ని, కుల బానిసత్వాన్ని శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. మనిషి స్వతంత్రుడై గౌరవమైన ఆలోచనలతో జీవించాలని, తలవంచి జీవించడాన్ని నిరాకరించాడు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేశాడు. మానవతాపూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటతో చాటారు. సమాజాన్ని మేల్కొలిపే బాటలో పయనించారు.

సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్ధనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున అణగారిన చర్మకార కుటుంబంలో జన్మించారు, కలసాదేవి, సంతోఖ్ దాస్ తల్లిదండ్రులు. రవిదాస్, కబీర్కు సమకాలీకుడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక సన్యాసిగానే అంటరానివారి కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషిచేశారు. సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధకురాలయిన అంతఃపురవాసి మీరాబాయి లాంటి వారెందరో రవిదాస్ వెంటనడిచారు. ఆయన పదాలు బనారస్ దాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ల వరకూ ప్రవహించాయి. భక్తకవిగా, ఒక ప్రవక్తగా ఎదిగి ఆయన చేసిన పోరాటం ఈనాటి సమాజానికి ఒక స్ఫూర్తి. ఆయన కవితల్లో అతి సున్నితంగా సందేశం, శాంతి సమానతలు ప్రజల ఆలోచనల్లో అద్భుతమైన ప్రభావం చూపుతాయి. రవిదాస్కు కాశీ మహా రాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. సాక్షాతూ కాశీ మహరాజ్ రవిదాస్ జ్ఞానానికి పాదాక్రాంతుడై ఆయన్ని సన్మానించాడు. రవిదాస్ జీవితాంతం తన చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా బతికారు. చిత్తోడ్ రాజు రాణా సంగా, రాణిఝాలీ దేవిల అభ్యర్థన మేరకు రవిదాస్ దంపతులు చిత్తోడ్ వెళ్లారు. వీరికి అక్కడ రాజమర్యాదలతో స్వాగతం లభించింది. మహారాజు వద్ద అతిథిగా కొంతకాలం అక్కడే ఉన్నారు. చిత్తోడ్ కోటలోనే రవిదాస్ తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెపుతారు.

సమానో మంత్ర.. అనే వేదసారమంతా రవిదాస్ పదాలలో ఉంది. ” ఐసా బహురాజ్ మై జహా మిలైసబన్ కోఅక్స్ చోట్ బడో సబ్ సమ్ బపై రైదాస్ రహె ప్రసన్న్ ( ఎక్కడైతే అందరికీ భోజనం లభిస్తుందో, ఎవరూ ఆకలితో నిద్రపోరో.. ఎక్కడ ఎక్కువ తక్కువుల అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటారో.. అలాంటి సమాజాన్ని, అలాంటి పాలనా వ్యవస్థని రవిదాస్ కోరుకుంటున్నాడు). “కులం గురించి ఎవరూ, ఎవర్నీ అడగ కూడదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరూ మనిషి కులానికి చెందినవారే. మానవత్వమే పరమ ధర్మం” అని ఆయన బోధించారు. ఆయన చెప్పే ప్రతి మాటా అనుభవం నుంచి, అధ్యయనం నుంచి, అవగాహన నుంచి మానవతావాదం నుంచి పుట్టుకొచ్చాయి. “నా కులం చమార్. ప్రజలు దాన్ని తక్కువగా చూస్తున్నారు. మా జాతి చనిపో యిన జంతువులను ఊరికి దూరంగా మోసుకెళ్లి పర్యావరణం దెబ్బతినకుండా చూస్తూ ఉంది. మంచి గాలిని సమాజానికి ప్రసాదిస్తూ, సమాజ హితానికి తోడ్పడుతోంది” అని చాటారు. జాతి వైతాళికులైన అంబేద్కర్ లాంటి వారిపై రవిదాస్ ప్రభావం చాలా వరకు ఉంది. రవిదాస్ ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం. సామాజిక సమరసత కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక ఉత్తేజం, పదవుల లాలసతో నేటి విభజన, విద్వేష రాజకీయాలు గ్రామీణ ప్రజా జీవితాల్ని విచ్చిన్నం చేస్తున్న తరుణంలో సంత్ రవిదాస్ బోధనలు, జీవితం విస్తృత ప్రచారం చేయాలి. సామాజిక సమరసతను నిర్మాణం చేసి సామూహిక ప్రజా జీవితాలలో శాంతిని నింపాలి. అయన కీర్తి,అయన స్ఫూర్తిని ఉత్తర భారతదేశం తో పాటు దక్షణ భారత్ లో కూడా యావత్ దళిత జాతి విస్తృతంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అయన జయంతిని అధికారికంగా నిర్వహించి వారికి నివాళి అర్పించడం యావత్ భారత జాతిని గౌరవించుకోవడమే.

వ్యాస కర్త : బైరి వెంకటేశం మోచి
జాతీయ అధ్యక్షులు
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి
Mob: 9491994090

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin