-
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆరు నియోజకవర్గాలలో టికెట్‌లు ఇవ్వాలి
-
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం
నిజామాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగిన ఎస్సీ ఉపకులాలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 6 నియోజకవర్గాలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచీ రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టి.ఎన్.జి.ఓ భవనం లో జరిగిన “గోసంగి కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం” ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ చట్ట సభలలో రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల దళితులలో అత్యంత వెనుకబడిన ఉపకులాల బ్రతుకులు మారలేదన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక,రాజకీయ పరంగా మాల, మాదిగలతో పోల్చితే వీరికి ఎలాంటి లబ్ది చేకూరలేదని అన్నారు. ఈ బడ్జెట్ లోనే ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి నిధిని విడుదల చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికి బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. తమ సమస్యల సాధనకు త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. గోసంగి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్నాల లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరగొండ బుచ్చన్న నాయకులు గంధం బుద్దిరాజు, రాసరి నరేష్,ఈర్నాల గంగాధర్, మైకెల్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews