హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. అధికార పార్టీ BRS మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణలో గెలిస్తేనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించి నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంతో వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం అవుతున్న కేటీఆర్ పలు జిల్లాల నుంచి తనకు అనుకూలంగా ఉండే టీమ్‌ను తయారు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కొంతమంది యువనాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ టీమ్‌లో కొంతమంది మహిళలు, డాక్టర్లు, తెలంగాణ ఎన్నారైలు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టు సమాచారం.
టీమ్ కేటీఆర్‌గా ప్రచారం అవుతున్న నాయకులు..
ఆదిలాబాద్ – బాల్క సుమన్, నడిపెల్లి విజిత్, జాన్సన్ నాయక్
కరీంనగర్ – డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కొప్పుల నందిని
మహబూబ్ నగర్ – మున్నూర్ రవి, గువ్వల బాల్ రాజు
నల్లగొండ – జలగం సుధీర్, గుత్తా అమిత్ రెడ్డి
రంగా రెడ్డి – శంబిపూర్ రాజు, పైలట్ రోహిత్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, మంచిరెడ్డి ప్రశాంత్
వరంగల్ – పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య
ఖమ్మం – పువ్వాడ అజయ్, తుమ్మల యుగంధర్, గడల శ్రీనివాస్ రావు
హైదరాబాద్ – రావుల శ్రీధర్ రెడ్డి, క్రిషాంక్, జగన్ పాటిమీది
నిజామాబాద్ – పోచంపల్లి భాస్కర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్
మెదక్ – మైనంపల్లి రోహిత్, నీలం మధు ముదిరాజ్
యువకులకు ప్రొత్సాహం ఇస్తే తెలంగాణ ను మరింత అభివృద్ది దిశగా తీసుకువెళ్లటానికి ఆస్కారం ఉంటుందని కేటీఆర్ తన సన్నిహితులతో మనసులో మాట చెప్పిట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/