– సింగిరెడ్డి నరేష్ రెడ్డి  

ప్రవాసీల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) కోసం రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 2016 నుంచి ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా ఎన్నికల ముందు కేరళ తరహాలో ‘తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేస్తారని, గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకుంటారనే ఆశతో ఉన్నారు.

‘తెలంగాణ ప్రవాసుల సంక్షేమం’ పేరిట 2014 లో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక  పేజీ నెం.22 లో ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో… ఎన్నారై మంత్రి కె. తారక రామారావు అధ్యక్షతన 27 జులై 2016 న హైదరాబాద్ లో విస్తృతస్థాయి ఎన్నారై పాలసీ సమావేశం జరిగింది. ముసాయిదా పత్రం (డ్రాఫ్ట్ కాపీ) రూపొందించి జిఎడి (సాధారణ పరిపాలన శాఖ), హోమ్, పరిశ్రమలు, ఐటి, కార్మిక ఉపాధి, ఆర్థిక, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక, టాంకామ్ తదితర శాఖలకు పంపించి ఆయా శాఖల సూచనలను పరిగణలోకి తీసుకొని తుది ముసాయిదాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. ఇక మంత్రి మండలి ఆమోదం పొందడమే తరువాయి అని 2016 నుంచి తెలంగాణ ప్రవాసీ లోకం ఎదురుచూస్తోంది.

విదేశాలకు వలస వెళ్లే కూలీలు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించే వైఖరిని ఒక సమగ్రమైన రూపంలో తెలిపేదే ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం). అసలు ఎన్నారై పాలసీ ఏ విధంగా ఉండబోతుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసీల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పరంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని తలపెట్టారు.

ప్రతిపాదిత ప్రవాసీ సంక్షేమం

◉ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు. కేంద్ర ప్రభుత్వ ‘ముద్ర’ పథకంతో అనుసంధానం.
◉ బ్లూ కాలర్ వర్కర్స్ (అల్పాదాయ కార్మికులు) ను ఆదుకోవడానికి ‘తెలంగాణ స్టేట్ ఎన్నారై వెల్ఫేర్ ఫండ్’ (తెలంగాణ రాష్ట్ర ప్రవాస భారతీయుల సంక్షేమ నిధి) ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
◉ ప్రభుత్వం, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుండి విరాళాలు సేకరించి ఈ నిధికి జమచేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్దిపొందని పేద కార్మికులను ఆదుకోవడానికి, ఎక్స్ గ్రేషియా (మృతధన  సహాయం) చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు.
◉ విదేశాల్లో మరణించినవారి శవపేటికలను హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి వారి స్వగ్రామాల వరకు రవాణాకై ఉచిత అంబులెన్సు సౌకర్యం. రేషన్ కార్డుల నిబంధన లేకుండా అందరికీ వర్తింపు.
◉ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం.
◉ హైదరాబాద్ లో ఎన్నారై భవన్ ఏర్పాటు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన.
◉ కొత్తగా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి మార్జిన్ మనీ, రుణ సౌకర్యం కల్పించడం.
◉ తెల్ల రేషన్ కార్డులు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు, గృహనిర్మాణం వంటి పథకాల వర్తింపుకు చర్యలు.
◉ 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం). విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు ‘ప్రవాసి తెలంగాణ’ వెబ్ పోర్టల్ ఏర్పాటు.
◉ ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం. సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయింపులు.

ప్రవాసి తెలంగాణ దివస్

ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానికి వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి ‘ప్రవాసి తెలంగాణ దివస్’ ను జరుపుతారు. తెలంగాణ ఎన్నారైల సమస్యలను చర్చించడానికి, వారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన తెలంగాణ ఎన్నారైలకు ‘ఉత్తమ తెలంగాణ ప్రవాసి’ అవార్డులను ప్రధానం చేస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా పర్యాటక, సాంస్కృతిక శాఖలు పలు కార్యక్రమాలను చేపడతారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ ఇన్వెస్టుమెంట్ సమ్మిట్ (పెట్టుబడుల సమావేశం) ఏర్పాటు చేస్తుంది.

తెలంగాణ ఎన్నారై కౌన్సిల్

ముఖ్యమంత్రి చైర్మన్ గా అత్యున్నత స్థాయి వ్యవస్థ ‘తెలంగాణ ఎన్నారై కౌన్సిల్’ (తెలంగాణ ప్రవాస భారతీయుల మండలి) ఏర్పాటు చేయనున్నారు. ప్రవాసుల సంక్షేమం గురించి ప్రభుత్వ విధానాలపై అన్ని విధాలా మార్గదర్శనం చేయడం, ‘సెంటా’ ద్వారా అమలు చేయబడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేయడం, సమీక్షించడం, ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ నిర్వహణను పరిశీలించడం ఈ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన విధులు. ఎన్నారై మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. ప్రవాసి తెలంగాణా సంఘాల ప్రతినిధుల (జనాభాను బట్టి 1-3 ముగ్గురు) ను సభ్యులుగా తీసుకుంటారు. సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ‘సెంటా’ సిఇఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులను కూడా సభ్యులుగా చేర్చాలనే సూచనలు ఉన్నాయి.

సెంటా

‘సెంటా’ (సెంటర్ ఫర్ నాన్ రెసిడెంట్ తెలంగానైట్స్ అఫేర్స్) అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల కేంద్రం. ‘సెంటా’ కు ఎన్నారై మంత్రి ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ అధికారి అయిన సిఇఓ పరిపాలన అధినేతగా  వ్యవహరిస్తారు. ఈ కేంద్రం ఎన్నారైల సమస్యలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయము చేస్తూ ఒక కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది.

‘తెలంగాణ ఎన్నారై కౌన్సిల్’ మార్గదర్శనంలో ప్రవాసీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం కొరకు సమన్వయము చేయడము. అవసరమైన సమయాలలో ప్రవాసీల సంక్షేమానికి పాలనాపరమైన చర్యలు తీసుకోవడం. ప్రవాసీలు గణాంకాలు (డేటా బేస్) తయారుచేయడం, నిర్వహించడం. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మిషన్ తో సమన్వయ చేస్తూ ప్రవాసులకు నైపుణ్య అభివృద్ధి, నవీకరణ కార్యక్రమాలు చేపట్టడం. విదేశీ ఉద్యోగాల కల్పనా సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకామ్) ను బలోపేతం చేయడం.

డి-సెంటా

డిస్ట్రిక్ట్ సెంటర్ ఫర్ నాన్ రెసిడెంట్ తెలంగానైట్స్ అఫేర్స్ – డి-సెంటా అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల జిల్లా కేంద్రం. రిక్రూటింగ్ ఏజెన్సీలపై దృష్టిపెట్టడం. అంతర్జాతీయ వలసలపై సమాచార వ్యాప్తి, అవగాహన కలిగించడం. కౌన్సిలింగ్, సలహాలు. ‘ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రేనింగ్’ – పిడిఓటి (ప్రయాణ ముందస్తు అవగాహనా శిక్షణ) నిర్వహించడం. గణాంకాలు (డేటా బేస్) నిర్వహించడం లాంటి ముఖ్యమైన బాధ్యతలు చేపడుతుంది. ‘డి-సెంటా’ కు జిల్లా కలెక్టర్ అధినేతగా ఉంటారు. జిల్లా కార్మిక సంక్షేమ అధికారి జనరల్ మేనేజర్ గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, కార్మిక,  ఉపాధి కల్పన శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు.

జిల్లా పోలీసు అధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సీనియర్ గల్ఫ్ రిటర్నీలు, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులను కూడా సభ్యులుగా చేరిస్తే బాగుంటుంది.

-సింగిరెడ్డి నరేష్ రెడ్డి
+91 90104 44111

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin