సమర్పణః అఖిల్ అండ్ నిఖిల్
బేనర్ః సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్
హీరో హీరోయిన్ః మనోజ్, చాందిని భగవానాని
క్యారక్టర్ ఆర్టిస్ట్స్ః రాజా రవీంద్ర, సన
సంభాషణలుః గౌరీశ్వర్, శివప్రసాద్ సామల
సంగీతంః కిరణ్ వెన్న
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ః ఎస్ కె బాజీ
దర్శకత్వంః నాగరాజ్ బొడెమ్
నిర్మాతః డి. హరిబాబు
రేటింగ్ః 3.25/5
టైటిల్ దగ్గర నుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా `14 డేస్ లవ్` ప్రతి అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ వారం విడుదలైన ఈ చిత్రం థియేటర్స్ లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
స్టోరీ
రెడ్డప్పకు చిత్ర ( హీరోయిన్ చాందిని భగవనాని) అనే ఒక కూతురు ఉంటుంది. అదే ఊళ్లో ఉంటోన్న రవితో లవ్ లో పడుతుంది. ఇంట్లో తెలియడంతో ఇద్దరూ లేచిపోవాలనుకుంటారు. ఇద్దరూ ఒకేసారి వెళితే ఇంట్లో డౌట్ వస్తుందని.. హీరోయిన్ ముందుగా హైదరాబాద్ వెళుతుంది. అదే సమయంలో కరోన వల్ల లాక్ డౌన్ వస్తుంది. దీంతో చిత్ర హైదరాబాద్ లో, రవి ఊళ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కూతురు కనిపించకపోవడంతో రెడ్డప్ప రవిని నిలదీస్తాడు. రవి జరిగిన విషయం అంతా చెబుతాడు. చిత్ర హైదరాబాద్ లో ఇరుక్కుపోవడంతో.. ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ఉంటోన్న రెడ్డప్ప సోదరి(సన)కి కాల్ చేసి విషయం చెప్పడంతో.. చిత్ర అలా వాళ్ల అత్తమ్మ ఇంటికి చేరుకుంటుంది. కానీ రెడ్డప్ప అక్క కొడుకుకి ..రెడ్డప్ప ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు. దీంతో ‘చిత్ర’తో అన్యమనస్కంగా ఉంటుంటాడు. ఈ నేపథ్యంలో రెడ్డప్ప సోదరికి కరోనా వస్తుంది. 14 రోజులు క్యారంటైన్ లో ఉంటుంది. ఈ క్రమంలో చిత్రకు తన బావకు చిన్నాకు మధ్య చనువు పెరిగి ప్రేమగా చిగురుస్తుంది. అసలు రెడ్డప్పకు, తన సోదరి ఫ్యామిలీకి పడక పోవడానికి కారణం ఏంటి? చిత్ర మొదట రవిని ప్రేమించి తన బావతో ప్రేమలో పడటానికి రీజన్ ఏంటి ? ఈ రెండు ఫ్యామిలీలను కలపడానికే చిత్ర ఇదంతా చేసిందా ?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ః
పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించిన చాందినిభగవానాని ఈ సినిమాలో మెయిన్ రోల్‌లో నటించింది. ఆమె పర్ఫార్మెన్స్, గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే పది సినిమాల్లో నటించిన మనోజ్ ఈ సినిమాలో చాలా ఈజ్ తో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అనడంలో సందేహం లేదు. మన పక్కింటి కుర్రాడిలా తన క్యారక్టర్ ఉంటుంది. అతని ఫర్మార్మెన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇక సీనియర్ నటుడు రాజారవీంద్ర, నటి సనాషనూర్ ముఖ్య పాత్రల్లో నటించి సినిమాకు ప్రాణం పోసారు. చాందిని రెండు ఫ్యామిలీలను కలిపే పాత్రలో ఒదిగిపోయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా పండించింది. అలాగే హీరో కూడా ఎక్కడా తడబడకుండా రియాలిటీకి దగ్గరగా ఉండేలా నటన కనబరిచాడు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
టెక్నికల్ పరంగా అన్ని విభాగాలను సరిగ్గా వాడుకోవడంలో డైరెక్టర్ నాగరాజ్ బొడెమ్ సక్సెస్ అయ్యాడు. కిరణ్ వెన్న అందించిన మ్యూజిక్ సూపర్. ఎస్ కె బాజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రివర్స్ స్క్రీన్ ప్లే.. వంటివి సినిమాకు మెయిన్ ఎస్సెట్ అని చెప్పాలి. మేకింగ్ విజువల్స్, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బ్రిలియంట్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేశారు. ఇక దర్శకుడు సింపుల్ లైన్ తీసుకుని తన అద్బుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ఆయువుపట్టు అని చెప్పవచ్చు. డైలాగ్స్ కూడా చాలా సహంజంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటేః
సినిమా అంతా ఆద్యంతం ఆసక్తి కలిగించే కథనంతో నడుస్తుంది. రివెంజ్ లవ్ స్టోరీని క్రైమ్ థ్రిల్లర్‌గా రాసుకుని డైరెక్టర్ తను అనుకున్నది తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎక్కడ రాజీపడకుండా కథకు తగిన రీతిలో బడ్జెట్ పెట్టినట్టు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మొత్తానికి ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ ని వాడుకుని డైరక్టర్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాని పండించాడు. ఈ విషయంలో దర్శకుణ్ని అభినందించి తీరాలి. ఈ మధ్య కాలంలో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన సినిమా `14 డేస్ లవ్` అని చెప్పవచ్చు. యూత్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాలు హ్యాపీగా చూసే సినిమా ఇది. డోంట్ మిస్.. గో అండ్ వాచ్.