▪️ ‘మనంసైతం’ సేవలను గుర్తించిన రోటరీ క్లబ్
▪️ రోటరీ క్లబ్ ఒకేసనల్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కారం
▪️ FNCC లో ఘనంగా జరిగిన అవార్డు కార్యక్రమం
హైదరాబాద్: ‘మనంసైతం’ అంటూ పదేళ్ల పైగా నిరంతరం సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నటుడు కాదంబరి కిరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డును కాదంబరి కిరణ్‌కు అందించి, సత్కరించారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని, పేదల పాలిట కనిపించే దేవుడని బుర్ర వెంకటేశం కొనియాడారు. రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ జోన్ నిర్వహకులు సీవీ సుబ్బారావు, సుదేష్ రెడ్డి, టీఎమ్ఎన్ చౌదరీ మాట్లాడుతూ.. కాదంబరి కిరణ్ పదేళ్లుగా చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. సేవరంగం నుంచి కాదంబరి కిరణ్, సినిమారంగం నుంచి జయసుధ, సంగీతం రంగం నుంచి విజిల్ రమణారెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ సాయిపద్మ అవార్డ్స్ అందుకున్నవారిలో ఉన్నారు.
ఈ సందర్బంగా ‘మనంసైతం’ కుటుంబం నుంచి కాదంబరి కిరణ్ చేస్తున్న సేవ కార్యక్రమాలను చూపించే ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ”ఐశ్వర్యం అంటే మనిషి కి సాటి మనిషి తోడుండటం. ఇతర జీవులు తోటి జీవులకు సాయపడుతాయి. కానీ మనిషి మాత్రం తన జీవితమంతా తన వారసులు మాత్రమే తన సంపాదన అనుభవించా లని ఆరాటపడుతాడు. ఒకరికొకరం సాయం చేసుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కరోనా సమయంలో 50 వేల మంది నిస్సాహయులకు సాయం చేశాం. అనాధ, వృద్ధాప్య ఆశ్రమం (సపర్య we care for uncared) ప్రారంభించి వారికి సేవ చేసుకోవడంమే నా జీవిత లక్ష్యం. పేదలకు సేవ చేస్తే చిన్నపిల్లల కాళ్ళు అయినా మొక్కుతా.. లేదంటే పరమ శివుడినైనా ఎదురిస్తా” అని ఈ సందర్భంగా అన్నారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం కుటుంబం అండగా ఉంటుందని కాదంబరి కిరణ్ చెప్పారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r