▪️ మే 24, 25, 26 తేదీల‌లో TTA మెగా కన్వెన్షన్
▪️ వేడుక‌ల‌కు సియాటెల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ సిద్ధం
▪️ TTA అధ్య‌క్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు
▪️ పాల్గొననున్న తెలుగు ప్ర‌ముఖులు

సియాటెల్:  తెలుగు క‌ళ‌ల తోట – తెలంగాణ సేవ‌ల కోట‌.. అంటూ తెలంగాణ సంస్కృతిని ప‌దిల‌ప‌రిచేందుకు ఉత్తర అమెరికాలోనే తొలి తెలంగాణ అసోషియేష‌న్‌గా డా. పైళ్ల మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో పురుడుపోసుకున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఈ ఏడాది అగ్ర‌రాజ్యంలో మ‌హా స‌భ‌లు భారీగా నిర్వ‌హించ‌బోతోంది. సియాటెల్ క‌న్వెష‌న్ సెంట‌ర్‌లో మే 24, 25, 26 తేదీల‌లో జ‌ర‌గ‌నున్న టీటీఏ మెగా కన్వెన్షన్ కోసం టీటీఏ అధ్య‌క్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ స‌భ‌ల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ప‌లువురు అతిర‌థ మ‌హార‌థులు పాల్గొన‌బోతున్నారు.

ఇప్ప‌టికే మెగా కన్వెన్షన్ కోసం కిక్-ఆఫ్ – ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ జ‌రుగుతున్నాయి. 32 రాష్ట్రాల్లో విస్తరించిన టీటీఏ ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌లో కిక్-ఆఫ్ ఈవెంట్స్ ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ ఈవెంట్ల‌కు భారీ స్పందన వ‌చ్చింద‌ని టీటీఏ అధ్య‌క్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. మ‌హా స‌భ‌ల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. ఈసారి ఈ TTA మెగా కన్వెన్షన్‌లో సీతారాముల క‌ల్యాణం క‌న్నుల‌పండ‌వ‌గా నిర్వ‌హించ‌నున్నారు. భ‌ద్ర‌చ‌లం నుంచి పండితులు వ‌చ్చి సీతారాముల క‌ల్యాణం జ‌రిపిస్తారు. ఇక‌ టీటీఏ స్పెష‌ల్ సావ‌నీర్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ ప్ర‌త్యేక సంచిక కోసం ర‌చ‌న‌లను ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు టీటీఏ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ఫిలిం సెల‌బ్రెటీలు ఎంపిక చేసిన బెస్ట్ షార్ట్ ఫిలింల‌కు అవార్డులను కూడా అందిస్తారు. పూర్తి వివ‌రాలు త‌మ సోష‌ల్ మీడియాలో గానీ, mytelanganaus.org వెబ్‌సైట్‌లో ఉంటాయని వంశీరెడ్డి కంచరకుంట్ల తెలిపారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)ను ఏర్పాటు చేసిన డా.పైళ్ల మ‌ల్లారెడ్డి, అడ్వైజ‌రీ కౌన్సిల్ ఛైర్ డా. విజ‌య‌పాల్ రెడ్డి, కోచైర్ డా. మోహ‌న్ రెడ్డి ప‌ట‌లోళ్ల‌, స‌భ్యులు భ‌ర‌త్‌రెడ్డి మాదాడిల‌ను వంశీరెడ్డి కంచ‌ర‌కుంట్ల కొనియాడారు. వారు వేసిన బాట‌లో కొన‌సాగడం గ‌ర్వంగా ఉంద‌న్నారు.

ఇండియ‌న్ క‌మ్యూనిటీ అంద‌రినీ ఒక్క‌చోట‌కు చేర్చే వేదిక‌గా మార‌బోతోంది ఈ మెగా కన్వెన్షన్ వేదిక‌. వారంద‌రితో క‌ల‌సి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హింనుంది టీటీఏ. అంతేకాదు క్లౌడ్ క్యాపిట‌ల్‌గా పిల‌వ‌బ‌డే సియాటెల్ న‌గ‌రంలో ఈ స‌భ‌లు జ‌రుగుతుండ‌టంతో ఎంట‌ర్‌ప్రెన్యూర్స్, ఐటీ అధినేత‌లను ఆహ్వానించి వారికి ప్ర‌త్యేక గౌర‌వం అందించ‌నున్నారు.

ఎగ్జిక్యూటివ్ స‌భ్యులు.. TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల, TTA స‌భ‌ల క‌న్వీన‌ర్ చంద్ర‌సేన శ్రీ‌రామోజు, TTA ప్రెసిడెంట్-ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, జనరల్ సెక్రటరీ కవితా రెడ్డి, కోశాధికారి సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డా. దివాక‌ర్ జంధ్యం, జాయింట్ సెక్ర‌ట‌రీ శివ‌రెడ్డి కొల్ల‌, జాయింట్ ట్రీజ‌ర‌ర్ మ‌నోహ‌ర్ బొడ్కె, నేష‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ ప్ర‌దీప్ మెట్టు, ఇంటర్నల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనరపు, నేషనల్ ఇంటర్నల్ అఫైర్స్ కోఆర్డినేటర్ వెంకన్నగారి సురేష్ రెడ్డి, మీడియా క‌మ్యునికేష‌న్ డైరెక్ట‌ర్ నిషాంత్ సిరికొండ‌, మెంబ‌ర్‌షిప్ అడ్వైజ‌ర్ అమిత్ రెడ్డి సుర‌కంటి, ఎథిక్స్ క‌మిటీ డైరెక్ట‌ర్ గ‌ణేష్ మ‌ధ‌వ్, ఉమెన్స్ ఫోరం అడ్వైజ‌ర్ స్వాతి చెన్నూరి, హెల్త్ వెల్‌నెస్ అడ్వైజ‌ర్ జ్యోతిరెడ్డి, ఇండియా కో-ఆర్డినేట‌ర్ ద్వార‌క‌నాథ్ రెడ్డి మెగా కన్వెన్షన్ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

BREAKING SHORTS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin