-
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి.
హైదరాబాద్: దళితుల 34 శాతం ఉన్న ఎస్సీ ఉపకులాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మా కులాల అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడం మానుకోవాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి హితవు పలికారు. హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం లో అయన ఉపకులాల నాయకులతో కలిసి మాట్లాడారు.
దళితులు అత్యంత వెనుకబడ్డ ఉప కులాల కోసమే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామని చెప్పే మందకృష్ణ మాదిగ ఎస్సీ ఉపకులాలు కొద్దిగా అభివృద్ధి చెందితేనే జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం 59 కులాల కోసం కాకుండా ఒక్క మాదిగ కులం కోసమేనన్నది స్పష్టమైoదని అన్నారు. ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వీళ్ళు ఊరుకోక్కరు ఉంటారని వీళ్ళతోని ఏమైతది అంటూ సోదర బైండ్ల కులం పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపకులాలను కించపరిచి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే అర్హత మందకృష్ణ మాదిగ కోల్పోయారని అన్నారు.
ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తూ మాల మాదిగల పుట్టుక నుంచి అంతిమ సంస్కారాల వరకు ఆధారపడేది మా ఉపకులాల మీదనే అనేది గుర్తుంచుకోవాలన్నారు. గ్రామ వైద్యులుగా గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన, గ్రామ దేవతల పూజారులుగా ఉండేది బైండ్ల కులస్థులేనన్నారు. వారికి వివాహాలు జరిపేది మాల, మాదిగ జంగాలు మిత అయ్యాల్వర్లు. వీరి చరిత్ర పురాణాలు చెప్పేది చిందు,డక్కలి, హోలీయా దాసరి, బుడగజంగాలు, మీకు బట్టలు నేసేది మా నేతకానిలు,మీకు చెప్పులు కుట్టేది మా మోచి,సమగర లు, మీరు మరణిస్తే శవకర్మలు చేసేది జంగాలు, శవాలని కానణం చేసేది మా బ్యాగరి కులస్తులు ఇదంతా ప్రతి గ్రామంలో అన్ని దళిత కులాలతో పాటు అన్ని బహుజన కులాలకు సేవలు అందిస్తారు. మీరు ఊరికి ఒక కులం ఉంటే మా ఉపకులాలు ఊరిలో పది పదిహేను కులాలు మీతో పాటు ఊరందరికీ సేవలు అందిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
75 ఏళ్లుగా రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న మాల మాదిగలు రాష్ట్రంలోని 19 అసెంబ్లీ స్థానాలను,మూడు పార్లమెంటు స్థానాలను తరతరాలుగా అనుభవించి మొన్న ఒక్క వరంగల్ ఎంపీ స్థానాన్ని వెనుకబడ్డ దళిత బైండ్ల కులానికి చెందిన ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినందుకు ఈయన సొంత పార్టీ టికెట్ అడిగినట్లు ఉపకులాలను జీర్ణించుకోలేక ఓర్చుకోలేక బైండ్ల ఉపకులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం హెయమైన చర్య అని అన్నారు. న్యాయంగా ఐతే మూడు ఎంపీ స్థానాలలో మూడు వర్గాలకు మాల, మాదిగ, ఉపకులాలకు దక్కాలి. ఉపకులాలకు కేటాయించిన వరంగల్ కాకుండా నాగర్ కర్నూల్ డిమాండ్ చేయాలి కదా. బీజేపీ రెండు స్థానాలను మాదిగలకే కేటాయించింది మాలలకు ఇవ్వలేదు, అదేవిదంగా బిఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేయాలికదా అన్నారు.
అయన నిజంగా దళితుల్లో సామాజిక న్యాయం పోరాడితే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో మాల మాదిగలతో ఉపకులాలకు సమాన వాట కోసం పోరాడాలి గాని రిజర్వేషన్ లపై గుత్తాదిపత్యం చేయాలని చూస్తూ ఎస్సీ ఉపకులాల అణచివేతకు కుట్రలు పన్నడం దారుణమన్నారు. ఇన్నేళ్లు ఉపకులాల సహకారంతో ఎదిగి ఉపకులాల సామాజిక న్యాయం కోసమే పోరాడుతున్నామని చెప్పి ఇప్పుడు తన స్వలాభం కోసం దళిత కులాల ఐక్యతను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.
రాజ్యాంగాన్నే రద్దు చేస్తామని బహిరంగ చెప్తున్న బిజెపి పార్టీకి మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు గురించి పోరాడడం విచిత్రంగా ఉందన్నారు. ఈయన చర్యల వల్ల మాదిగలను ఉపకులాలను అన్ని రాజకీయ పార్టీల వద్ద ద్రోహులుగా ముద్ర వేసే ప్రయత్నం చేసి వీరికి ఏ పార్టీలో కూడా అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చాటున ఉపకులాలను అణిచివేసే ఈయన కుట్రలు బయటపడ్డాయాని, రిజర్వేషన్ లలో సమాన వాటా మా జాతుల హక్కు, మేమెంతో మాకంత వాటా సాధిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని మాల మాదిగలతో సంభందం లేకుండా ఉపకులాలన్నిటిని ” A ” లో చేర్చాలని డిమాండ్ చేసారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r