పరుచూరి వెంకటేశ్వరరావు చాలా కాలంగా బయటికి రావడం లేదు. ఇప్పుడు బయటికి వచ్చిన ఆయన ఫోటోను చూసి అంతా షాక్ అయిపోతున్నారు. పరుచూరి బ్రదర్స్ తెలియని తెలుగు సినీ అభిమానులు ఉండ‌రు. దాదాపు 300 సినిమాలకు పైగా రచన చేసిన ఈ ఇద్దరూ.. గుర్తుండిపోయేలా సినిమాల‌కు మాటలు రాశారు. ఎన్నో సినిమాలకు కథ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం కూడా వహించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో పని చేసిన అనుభవం వీళ్ల సొంతం. మొన్నటికి మొన్న చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 వరకు ఎన్నో సినిమాలకు రాశారు వాళ్లు. అయితే ఈ మధ్య కాలంలో వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాత్రం యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సినిమా రివ్యూస్ చెప్తున్నాడు. మరోవైపు వెంకటేశ్వర రావు మాత్రం దూరంగానే ఉన్నాడు. ఈ మధ్య బయటికి కూడా రావడం లేదు ఈయన. తాజాగా ఆయన దగ్గరికి దర్శకుడు జయంత్ సి పరాన్జీ వెళ్లినపుడు ఆ ఫోటో తీసి ఇన్‌స్టాలో పొస్ట్ చేసాడు. అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో పరుచూరిని చూసి.. అయ్యో ఏంటిది పెద్దాయన ఇలా అయిపోయాడు అంటూ బాధ పడుతున్నారు ఫ్యాన్స్.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కొందరు పరుచూరిని కొన్ని రోజులుగా చూడటం లేదు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆయన దర్శనమే లేకుండా పోయింది. పైగా కొన్నేళ్ల కింద ఆయన భార్య చనిపోయారు. అప్పట్నుంచి మరింత కుంగిపోయారు పరుచూరి వెంకటేశ్వరరావు. దానికితోడు వయోభారంతోనూ బాధ పడుతున్నారు. ఇవన్నీ ఈయన మొహంలోనే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరుచూరిని చూసిన వాళ్లంతా అయ్యో పాపం అంటున్నారు. 78 ఏళ్ళ పరుచూరి వెంకటేశ్వరరావు ఇప్పట్లో మళ్లీ సినిమాలకు పని చేయడం కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఓ రకంగా రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లోనే ఉండిపోయారు ఈయన.

By admin