హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్‌సైట్ ( www. scsubcastes.org )ను దళిత నాయకుడు, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశంతో కలిసి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ఎస్సీలలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల చరిత్ర సంస్కృతులను, వారి జీవన విధానాన్ని, జనాభా మొదలైన పూర్తి వివరాలను వెబ్‌సైట్ ద్వారా సమాజానికి తెలియజేస్తూ గొప్ప ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. దళితబందు పథకంలో ఉపకులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం గతంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష ను కూడా చేశారని ఇప్పటికైనా దళిత బంధు పథకం లో ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధనకార్యదర్శి ఏర్పుల భాస్కర్ బైండ్ల, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిముల్ల వెంకటేష్ హోలేయదసరి, రాయిల లక్ష్మినర్సయ్య చిందు, ఏదుల్ల గౌరీ శంకర్ బైండ్ల, పవన్ నాయకులు గడ్డం సమ్మయ్య, ముప్పాళ్ళ సుధాకర్, గడ్డం సుదర్శన్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/dbkILTnFtwE

 

 

 

By admin