◉ గల్ఫ్ నుంచి 100 మంది తెలంగాణ ప్రవాసుల రాక
◉ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో డిమాండ్ల ప్లకార్డులు, బ్యానర్ ప్రదర్శన
HYDERABAD (MEDIABOSS NETWORK):
తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేసే కార్యక్రమాల్లో భాగంగా గల్ఫ్ జేఏసీ తమ మరో అడుగు ముందుకేసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 8-10 జనవరి మూడు రోజుల పాటు జరుగుతున్న 17వ ప్రవాసి భారతీయ దివస్ లో పాల్గొనడానికి తెలంగాణ నుండి నలుగురు సభ్యుల గల్ఫ్ జేఏసీ బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇండోర్ కు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం గల్ఫ్ డివిజన్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస్ రావు, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ ఉన్నారు. ఇండోర్ కు వెళుతున్న తెలంగాణ బృందం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను, బ్యానర్ ను ప్రదర్శించారు.
ఇదిలా ఉండగా ఆరు అరబ్ గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ల నుంచి సుమారు వందమంది తెలంగాణ ప్రవాసులు ఇండోర్ కు వస్తున్నట్లు సమాచారం. 70 దేశాలకు చెందిన 3,500 మంది భారత ప్రవాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews