◆ స‌రికొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేప‌బోతోన్న మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి
◆ పార్టీ పేరు, జెండా రూపకల్పనపై కసరత్తులు
◆ ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న తెలంగాణ రాజ‌కీయం

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
తెలంగాణలో మరో కొత్త పార్టీకి శ్రీ‌కారం చుట్టబోతున్నారు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి. ఇటీవ‌ల కాలంలో ఆయన కేసీఆర్ స‌ర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ‌గ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న రాజకీయ పార్టీకి జెండా, ఎజెండా ఖరారు చేసే దిశలో మురళి కసరత్తులు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవల మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఆయన లేఖ కూడా రాశారు.

ఆకునూరి మురళి గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, స్టేట్ ఆర్కివ్స్ సంచాలకుడిగా పని చేశారు. పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన స్వచ్చంద పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీలోని జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారులుగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇటీవ‌ల తెలంగాణ రాజ‌కీయాల‌పై స్పందిస్తున్నారు.

ఇప్పటికే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఇప్పుడు ఆకునూరి మురళి కూడా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రవీణ్ కుమార్ బాటలోనే పొలిటికల్ ఎంట్రీ నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి.

 

మునుగోడు: 100% నిజ‌మైన GameChanzer స‌ర్వే

తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) పార్టీ ఆవిర్భావం!

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

By admin